Page Loader
Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే!
ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే!

Telangana: ప్రజాపాలనలో రేషన్ కార్డు అప్లై చేసారా? స్టేటస్ చెక్ చేసుకునే మార్గం ఇదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 21, 2025
12:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రగతిశీలంగా సాగుతోంది. ఇప్పటికే వేలాదిమంది కొత్త కార్డులు పొందుతుండగా, మరికొందరికి పాత కార్డుల్లో పేర్ల నమోదు కూడా జరుగుతోంది. అదే సమయంలో అర్హత లేని వారి పేర్లను తొలగించే ప్రక్రియ కూడా కొనసాగుతున్నది. కొత్త కార్డుల కోసం ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమం ద్వారా చాలామంది దరఖాస్తులు సమర్పించారు. ఇది పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించారు. మరోవైపు మీసేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసినవారికి అప్లికేషన్ నెంబర్ లభించడంతో వారు తమ స్టేటస్‌ను సులభంగా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకుంటున్నారు. కానీ ప్రజాపాలనలో అప్లికేషన్ ఇచ్చినవారికి అలాంటి అవకాశం లేకపోవడంతో దరఖాస్తు స్థితిని తెలుసుకోవడం కష్టంగా మారింది.

Details

స్టేటస్ తెలుసుకోవాలంటే ఎవ్వరిని సంప్రదించాలి? 

ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరికి కార్డు మంజూరవుతుందని హామీ ఇస్తున్నారు. తమ దరఖాస్తు స్థితి తెలుసుకోవాలనుకునేవారు తమ గ్రామ పంచాయతీ కార్యదర్శులను సంప్రదించవచ్చు. వారు ఇచ్చే సమాచారం ఆధారంగా, అవసరమైతే మండల స్థాయి అధికారుల‌ను (తహసీల్దార్‌ను) కలవడం ద్వారా మరింత స్పష్టత పొందవచ్చు.

Details

ప్రక్రియ ఎలా జరుగుతోంది?

ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులను ప్రస్తుతం ఆన్‌లైన్‌లోకి మళ్లించే పని వేగంగా సాగుతోంది. చాలా జిల్లాల్లో ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తికి చేరుకుంటోంది. ఆన్‌లైన్‌లో నమోదైన దరఖాస్తులపై రెవెన్యూ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు సమన్వయం చేస్తున్నారు. వారి పరిశీలన అనంతరం, దరఖాస్తు మండల తహసీల్దార్ లాగిన్‌కు చేరుతుంది. అక్కడ ఆమోదం లభించిన తర్వాత జిల్లా పౌరసరఫరాల అధికారి (DCSO) లాగిన్‌కు వెళ్తుంది. చివరిగా జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపిన తరువాత ప్రభుత్వం అధికారికంగా రేషన్ కార్డును మంజూరు చేస్తుంది . ఆమోదించిన కార్డులకు తదుపరి నెల నుంచి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం కేటాయిస్తున్నారు.

Details

కొత్త కార్డు లేదా పేర్ల నమోదు స్టేటస్ చెక్ చేసే విధానం 

పౌరులు తమ రేషన్ కార్డు వివరాలను ఆన్‌లైన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం: 1. ముందుగా 👉 [https://epds.telangana.gov.in/FoodSecurityAct/](https://epds.telangana.gov.in/FoodSecurityAct/) వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 2. అక్కడ "FSC Search" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. 3. "Ration Card Search" ఆప్షన్‌ కనిపిస్తుంది - దాన్ని సెలెక్ట్ చేయాలి. 4. తరువాత, మీ FSC Ref No లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. 5. మీ జిల్లా పేరు ఎంచుకుని, చివరగా "Search" బటన్‌పై క్లిక్ చేయాలి. 6. అప్పుడు మీ రేషన్ కార్డు వివరాలు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి.