
Heat Waves: తెలంగాణలో పెరుగుతుతున్న వడగాలులు.. ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో ఎండలు భగభగ మండుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా హెచ్చరికల ప్రకారం, ఈ రోజు, రేపు రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారే అవకాశం ఉండటంతో ఐఎండీ (భారత వాతావరణ శాఖ) రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కోమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.
ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకుపైగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ పేర్కొంది.
Details
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లే సమయంలో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచనలు జారీ చేసింది. మిగిలిన జిల్లాలన్నింటికీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గకపోవడంతో తీవ్ర ఉక్కపోత నెలకొంది.
వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశముందని, వడదెబ్బల కారణంగా మరణాల ప్రమాదం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.