Telangana: తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల వానలు.. 19, 20, 21 తేదీల్లో భారీ వర్షాలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Sep 16, 2026
08:50 am
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు 'పసుపు' రంగు హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక నుంచి నైరుతి బంగాళాఖాతం వరకు ఏర్పడిన ద్రోణి మంగళవారం తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు విస్తరించినట్లు వాతావరణ శాఖ వివరించింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణకు వర్ష సూచన.. మూడు రోజులు ఉరుములు, మెరుపులతో భారీ వానలు
తెలంగాణకు బిగ్ రెయిన్ అలర్ట్.. 5 రోజులు వానలే వానలు.. 'ఎల్లో' అలర్ట్ జారీ!https://t.co/6Bdq7giGso pic.twitter.com/YZTX81FtgJ
— Newsmeter Telugu (@NewsmeterTelugu) September 16, 2026