Loading...
Niti Valley Bridge : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన మెటల్ బ్రిడ్జి
ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన మెటల్ బ్రిడ్జి

Niti Valley Bridge : ఉత్తరాఖండ్‌లో వరద బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన మెటల్ బ్రిడ్జి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 11, 2026
12:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరద ఉద్ధృతికి చమోలీ జిల్లాలోని నీతి వ్యాలీలో ఓ మెటల్ బ్రిడ్జి క్షణాల్లోనే కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నీతి వ్యాలీ ప్రాంతంలోని ఓ నదిలో నీటిమట్టం ఒక్కసారిగా భారీగా పెరిగింది. దీంతో వరదనీరు లోతట్టు ప్రాంతాల వైపు వేగంగా దూసుకొచ్చింది. వరద ప్రవాహంతో పాటు పెద్ద మొత్తంలో మట్టి, బురద, భారీ బండరాళ్లు కొట్టుకువచ్చాయి. వేగంగా ప్రవహించిన ఇవి బ్రిడ్జిని బలంగా ఢీకొనడంతో మెటల్ బ్రిడ్జి తట్టుకోలేక పూర్తిగా కొట్టుకుపోయింది.

వివరాలు 

బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నీతి వ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో రాకపోకలు బంద్ 

వరద ఉద్ధృతి పెరిగే సమయానికి బ్రిడ్జిపై చాల వాహనాలు ఉన్నాయి. వరద ప్రవాహంలో అవి కూడా కొట్టుకుపోయాయి.

ఇదేసమయంలో సమీప రహదారిపై ఉన్న ఓ ట్రక్‌ డ్రైవర్ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి అప్రమత్తమయ్యాడు.

వెంటనే ట్రక్కును వెనక్కి తీసుకెళ్లడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

బ్రిడ్జి కొట్టుకుపోవడంతో నీతివ్యాలీ ప్రాంతానికి ప్రధాన పట్టణంతో ఉన్న రాకపోకల సంబంధం తెగిపోయింది.

దీంతో స్థానికులకు రాకపోకల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది.

పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చేవరకు ఈ ప్రాంతంలో ప్రయాణాలు చేయొద్దని అధికారులు ప్రజలకు సూచించారు.

అదేవిధంగా నదులు,వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

నదులు, వాగుల సమీపంలో నివసించే ప్రజలు సురక్షిత దూరంలో ఉండాలని సూచించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న మెటల్ బ్రిడ్జి

ADVERTISEMENT