తదుపరి వార్తా కథనం

Heavy Rains: భారీ వర్షాల హెచ్చరిక.. విద్యుత్ అత్యవసరాల కోసం 1912 నంబర్ సిద్ధంగా ఉంచండి!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 14, 2025
11:42 am
ఈ వార్తాకథనం ఏంటి
భారీ వర్షాల నేపథ్యంలో అపార్టుమెంట్ల సెల్లార్లలో వరద నీరు చేరి, విద్యుత్ మీటర్ల ప్యానెల్ బోర్డును తాకి ప్రమాదాలు సంభవించే అవకాశమున్నందున, అలాంటి ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం) సీఎండీ ముషారఫ్ సూచించారు. సెల్లార్లలో నీరు నిల్వ ఉండకుండా వెంటనే తొలగించేలా చర్యలు తీసుకోవాలని విద్యుత్ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అత్యవసర పరిస్థితులు లేదా ప్రమాదాలు చోటుచేసుకున్న వెంటనే 1912 నంబరుకు కాల్ చేసి సమాచారం అందించాల్సిందిగా సూచించారు. బుధవారం క్షేత్రస్థాయి తనిఖీ భాగంగా హుస్సేన్‌సాగర్ సబ్‌స్టేషన్‌ను సందర్శించిన ముషారఫ్, భారీ వర్షాలు కురిసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని డిస్కం సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్లు వెల్లడించారు.