Loading...
APSDMA: భారీ వర్షాలతో ఆకస్మిక వరదల ముప్పు.. ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక
భారీ వర్షాలతో ఆకస్మిక వరదల ముప్పు.. ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

APSDMA: భారీ వర్షాలతో ఆకస్మిక వరదల ముప్పు.. ఏపీఎస్డీఎంఏ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
04:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్రపై ప్రభావం చూపుతున్న 'మురసు' తీవ్ర తుపాను కారణంగా రానున్న మూడు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం 'మురసు' తీవ్ర తుపాను గత ఆరు గంటల్లో గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది.

వివరాలు 

భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు పొంగిపొర్లే ప్రమాదం

ఇది బాపట్లకు 40 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్లు, విజయవాడకు 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో పోలవరం,కాకినాడ,ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు, కడప, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు వెల్లడించారు.

ఈ నేపథ్యంలో ఎస్‌డీఎంఏ మేనేజింగ్ డైరెక్టర్, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

భారీ వర్షాల కారణంగా వాగులు,వంకలు పొంగిపొర్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని దాటేందుకు ప్రయత్నించవద్దని స్పష్టం చేశారు.

ఆకస్మిక వరదల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వివరాలు 

'మురసు' తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం

మరోవైపు, 'మురసు' తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ రోజు రాత్రి నుంచి ఈదురుగాలుల తీవ్రత కూడా తగ్గుతుందని అంచనా వేశారు.

అయినప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి హెచ్చరికలు తొలగించే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ADVERTISEMENT