
IMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఈ రాష్ట్రాల్లో 'భారీ నుంచి అతి భారీ వర్షాలు' కురిసే అవకాశం ఐఎండీ పేర్కొంది.
115.6 మి.మి నుంచి 204.4 మిమీ వరకు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది.
అదేవిధంగా, ఉత్తరాఖండ్‌లో16వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
అలర్డ్
అరుణాచల్, అసోం, మేఘాలయాలో ఆరెంజ్ అలర్ట్
ఉత్తరాఖండ్‌లోని చాలా జిల్లాల్లో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. శుక్రవారం కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే గుప్తకాశీ-గౌరీకుండ్ రహదారిని కొండచరియలు కమ్మేశాయి.
రుద్రప్రయాగతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయలకు శనివారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో 115.6 నుంచి 204.4 మి.మీ వరకు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ చెప్పింది. ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించింది.