Loading...
Mamata Banerjee: ఢిల్లీలో హైడ్రామా.. మమతా బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
ఢిల్లీలో హైడ్రామా.. మమతా బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

Mamata Banerjee: ఢిల్లీలో హైడ్రామా.. మమతా బెనర్జీని అదుపులోకి తీసుకున్న పోలీసులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 10, 2026
02:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆమె నిరసనకు దిగారు. ఢిల్లీలోని సౌత్ అవెన్యూ బస్ స్టాండ్ సమీపంలోని రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహిస్తుండగా పోలీసులు ఈ చర్య తీసుకున్నట్లు _హిందుస్థాన్ టైమ్స్_ వెల్లడించింది. అంతకుముందు, జ్ఞానేశ్ కుమార్‌ను ప్రధాన ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద నిర్వహించనున్న నిరసనలో పాల్గొంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆమె ఢిల్లీలో నిరసన కార్యక్రమంలో పాల్గొని ధర్నాకు దిగారు.

ADVERTISEMENT