హిమాచల్ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించండి: సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు
గత కొద్ది రోజులగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలకు హిమాచల్‌ప్రదేశ్,రాష్ట్రంలో ఇప్పటివరకు 74మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.ఈ క్రమంలోనే చాలా చోట్ల ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. ఎప్పుడు చూడని జల ప్రళయాన్నిహిమాచల్ రాష్ట్ర విపత్తుగాప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఈ ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారంకోరారు. కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం రాష్ట్రం వేచిచూస్తోందని తెలిపారు. సీఎం సుఖ్వీందర్ సుఖు మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యలను వేగవంతం చేశామని అలాగే ఇళ్లు కోల్పోయిన వారికి సాయం చేస్తున్నామన్నారు. ఈ వరదల కారణంగా రాష్ట్రానికి రూ.10వేల కోట్లు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సుఖు తెలిపారు.
ఆలయ శిథిలాల క్రింద మరో ఆరు మృతదేహాలు
షిమ్లా ప్రాంతంలోని సమ్మర్‌హిల్‌లో శివాలయం నేలకూలి ఘటనలో శిథిలాల కింద నుంచి ఇవాళ మరో మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి. షిమ్లాలోనే మొత్తంగా మూడు చోట్ల కొండ చరియలు విరిగిపడి 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఎస్పీ సంజీవ్‌కుమార్ గాంధీ పేర్కొన్నారు. ఇంకా ఆలయ శిథిలాల క్రింద ఆరు మృతదేహాలుండొచ్చని భావిస్తున్నారు. వర్షాకాలం మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 217 మంది ప్రాణాలు కోల్పోయారు. 11,301 ఇళ్లు పాక్షికంగా, పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉండటంతో 506 రహదారుల్లో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. కాంగ్రా జిల్లాలో వరదలు సంభవించిన నేపథ్యంలో గత మూడు రోజుల్లోనే 2,074 మందిని లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించి.. సురక్షిత ప్రాంతాలకు తరలించారు.