Himachal: హిమాచల్‌లో ఇంధన ధరల పెంపు.. 'వితంతు, అనాథల సెస్' అంటే ఏమిటి?
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు 60 పైసల చొప్పున 'వితంతు, అనాథల సంక్షేమ సెస్' విధించింది. హైస్పీడ్ డీజిల్‌పైనా లీటరుకు అదనంగా 60 పైసల సెస్ అమలు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. 'హిమాచల్‌ప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (VAT) చట్టం-2005'లోని సెక్షన్ 6-ఏ కింద ఈ సెస్‌ను వసూలు చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. సెస్ అమల్లోకి రావడంతో రాష్ట్ర రాజధాని సిమ్లాలో పెట్రోల్ ధర లీటరుకు రూ.102.45 నుంచి రూ.103.05కు పెరిగింది. ధర్మశాలలో పెట్రోల్ ధర లీటరుకు 71 పైసలు, డీజిల్ ధర 69 పైసల మేర పెరిగింది.
వివరాలు
బడ్జెట్ సమావేశాల్లోనే నిర్ణయం
ఈ ఏడాది జరిగిన బడ్జెట్ సమావేశాల్లో హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఆమోదించిన 'హిమాచల్‌ప్రదేశ్ విలువ ఆధారిత పన్ను (సవరణ) బిల్లు' ఆధారంగానే తాజా ఇంధన సెస్‌ను ప్రభుత్వం అమలు చేసింది.
ఈ బిల్లు ద్వారా పెట్రోల్, హైస్పీడ్ డీజిల్‌పై లీటరుకు గరిష్ఠంగా రూ.5 వరకు వితంతు, అనాథల సంక్షేమ సెస్ విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లభించింది.
అప్పుడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు మాట్లాడుతూ.. సెస్‌కు గరిష్ఠ పరిమితి రూ.5గా నిర్ణయించామని చెప్పారు. అయితే, ప్రస్తుతం 10 పైసలు విధించాలా, రూ.2 విధించాలా అన్నది ప్రభుత్వ విచక్షణపై ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
ఇంధన ధరల పెంపుపై రాజకీయ దుమారం
ఇంధన ధరల పెంపును కాంగ్రెస్ ఎంపీ సుఖ్‌దేవ్ భగత్ సమర్థించారు.
హిమాచల్‌ప్రదేశ్ భారీ విపత్తును ఎదుర్కొందని,ఆ సమయంలో ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చి పలు హామీలు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
అయితే,రాష్ట్రానికి అందాల్సిన కేంద్ర సహాయం మాత్రం పూర్తిస్థాయిలో అందలేదని ఆరోపించారు.
రాష్ట్రప్రభుత్వానికి ఆదాయ వనరులు పరిమితంగా ఉన్నాయని,ప్రత్యామ్నాయ మార్గాలు కూడా తక్కువేనని సుఖ్‌దేవ్ భగత్ అన్నారు.
ప్రభుత్వం విధిస్తున్న పన్నులు సంక్షేమ కార్యక్రమాల కోసం మాత్రమేనని,విలాసాలు లేదా ఇతర అనవసర ఖర్చుల కోసం కాదని ఆయన పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలను'ఏఎన్‌ఐ'వార్తా సంస్థ నివేదించింది.
మరోవైపు బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
పార్లమెంట్ సజావుగా సాగకుండా అడ్డుకునేవారే ఇప్పుడు విద్యార్థుల ప్రయోజనాల కోసం కూడా గళమెత్తడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'ఏఎన్‌ఐ' తో మాట్లాడుతున్న మంత్రి సుఖ్‌దేవ్ భగత్
#WATCH | Delhi: On HP government's cess on fuel, Congress MP Sukhdeo Bhagat says, "... Himachal Pradesh has gone through a disaster, the Prime Minister visited and made promises. But the Central assistance that should have been provided was not received. The government has… pic.twitter.com/yguCeeIBQB
— ANI (@ANI) August 12, 2026
ట్విట్టర్ పోస్ట్ చేయండి
'ఏఎన్‌ఐ' తో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ
#WATCH | Delhi | On Himachal Pradesh govt imposing Widow and Orphan Cess on fuel, BJP MP Manoj Tiwari says, "These are the same people who do not let the Parliament function, also do not stand up in the interest of the students." pic.twitter.com/175X99gvIk
— ANI (@ANI) August 12, 2026