Loading...
Jammu and Kashmir: కుల్గాంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి.. ముగ్గురికి గాయాలు
కుల్గాంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి.. ముగ్గురికి గాయాలు

Jammu and Kashmir: కుల్గాంలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రదాడి.. ముగ్గురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
03:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదుల దాడి కలకలం రేపింది. కుల్గాం జిల్లాలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌ను లక్ష్యంగా చేసుకుని బుధవారం ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు..క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన సీఆర్పీఎఫ్‌ జవాన్లు వెంటనే ఎదురుకాల్పులు ప్రారంభించారు. దీంతో ఉగ్రవాదులు అక్కడి నుంచి పరారయ్యారు.ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు గాయపడ్డారు.

వివరాలు 

క్యూఆర్‌టీ సహకారంతో కార్డన్‌ సెర్చ్

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.దాడికి పాల్పడిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌ (క్యూఆర్‌టీ) సహకారంతో క్యాంప్‌ పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నాయి.

ఈ దాడికి పాల్పడిన వారు పాకిస్థానీ ఉగ్రవాద ముఠాకు చెందినవారై ఉండొచ్చని భద్రతా వర్గాలు అనుమానిస్తున్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌పై ఉగ్రవాదుల కాల్పులు

ADVERTISEMENT