Page Loader
Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

Hyderabad: జూబ్లీహిల్స్‌లో భారీ పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 10, 2024
08:49 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఉన్న ఒక హోటల్‌లో తెల్లవారుజామున 4 గంటల సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనతో స్థానిక ప్రాంతంలోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుడు ధాటికి హోటల్ పక్కన ఉన్న దుర్గా భవాని నగర్ బస్తీకి చెందిన ఇళ్లు దెబ్బతిన్నాయి. బస్తీవాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడి ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. పేలుడు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీంలతో విచారణ ప్రారంభించారు.

Details

ఇద్దరికి గాయాలు

ఈ ప్రమాదానికి రిఫ్రిజిరేటర్‌లోని కంప్రెసర్ పేలుడు కారణమని అధికారులు ధ్రువీకరించారు. హోటల్ వెనుక రాతి గోడ ఉండటంతో పేలుడు కారణంగా రాళ్లు బస్తీలోని ఇళ్లపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. ఒక మహిళ తలకు బలమైన గాయం కాగా, మరో చిన్నారికి స్వల్ప గాయాలయ్యాయి. రాళ్లు, కాంక్రీట్ ముక్కలు పడటంతో బస్తీలోని ఐదు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.