Hyderabad: బిర్యానీ ఉడకలేదన్న కస్టమర్లపై హోటల్ సిబ్బంది దాడి
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లో ఓ చిన్న గొడవ చిలికి చికిలి పెద్ద ఘర్షణగా మారింది.
అబిడ్స్‌లోని గ్రాండ్‌హోటల్‌లో కస్టమర్లపై సిబ్బంది విచక్షణరహితంగా కర్రలతో దాడి చేశారు.
ఆదివారం రాత్రి నగరమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సమయంలో ఈ గొడవ జరిగింది.
ధూల్‌పేట్‌లోని గంగాబౌలికి చెందిన 8మంది కుటుంబసభ్యులు న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో బిర్యానీ తినేందుకు అబిడ్స్‌లోని గ్రాండ్‌హోటల్‌కు వచ్చారు.
ఈ క్రమంలో వెయిటర్లు తీసుకొచ్చిన బిర్యానీ సగమే ఉడకడంతో.. వారు తినేందుకు నిరాకరించారు.
అనంతరం వెయిటర్లు వేడిచేసిన బిర్యానీ తీసుకొచ్చారు. సగం ఉడికిన బిర్యానీని ఇచ్చారు కనుక.. బిల్లులో డిస్కౌంట్ ఇవ్వాలని కస్టమర్లు అడిగారు.
ఆగ్రహించిన వెయిటర్లు కస్టమర్లపై కర్రలతో దాడి చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హోటల్ నిర్వాహకులు, సిబ్బందిపై కేసు నమోదు
హైదరాబాద్ అబిడ్స్ గ్రాండ్ హోటల్లో కస్టమర్లపై దాడి.. బిర్యానీ సరిగ్గా లేదన్నందుకు చితకొట్టిన వెయిటర్లు..!#Customers #Waiters #Attack #Biryani #GrandHotel #RajaSingh #Hyderabad #NTVNews #NTVTelugu pic.twitter.com/xpdhMcMvFv
— NTV Telugu (@NtvTeluguLive) January 1, 2024