NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!
    తదుపరి వార్తా కథనం
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!
    ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!

    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 11, 2025
    05:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ మెట్రోకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్టుపై ప్రత్యేకంగా కేస్ స్టడీ నిర్వహించింది.

    అంతేకాదు ఈ అధ్యయనాన్ని హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో ప్రచురించింది. హైదరాబాద్ మెట్రోను ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మెట్రో ప్రాజెక్టులలో ఒకటిగా గుర్తించింది.

    ఈ మేరకు ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన విధానాలపై వివరాలు పొందుపరిచింది.

    హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం, ఈ మెట్రో రైలు నిర్మాణంలో భూసేకరణ, రాజకీయ ఒత్తిళ్లు, ప్రజా వ్యతిరేకత వంటి అనేక పెద్ద సవాళ్లున్నా వాటిని విజయవంతంగా ఎదుర్కొని ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి నాయకత్వం కీలకమైందని పేర్కొంది.

    Details

    ఈ అరుదైన గౌరవం భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది

    ఆయన దార్శనిక దృక్పథం, వ్యూహాత్మక అమలు హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు విజయానికి పునాది వేశాయని ఈ కేస్ స్టడీ వెల్లడించింది.

    ప్రాజెక్టును అత్యుత్తమ మెట్రో వ్యవస్థలలో ఒకటిగా మార్చడంలో పాలన సామర్థ్యం, సాంకేతిక పరిజ్ఞానం, రంగాల మధ్య సమన్వయం, ఆర్థిక వినూత్నత, చర్చల వ్యూహం ముఖ్యపాత్ర పోషించాయి.

    హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రకారం, ఈ ప్రాజెక్టులో అనుసరించిన ఆవిష్కరణాత్మక ఆర్థిక నమూనాలు, ఉన్నత ఇంజనీరింగ్ పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి బ్లూప్రింట్‌గా మారాయని తెలిపింది.

    హైదరాబాద్ మెట్రోకు లభించిన ఈ అరుదైన గౌరవం భారత్‌కు గర్వకారణంగా నిలుస్తోంది.

    ఈ కేస్ స్టడీని హార్వర్డ్ బిజినెస్ పబ్లిషింగ్ వెబ్‌సైట్‌లో [https://hbsp.harvard.edu/product/ISB477-PDF-ENG](https://hbsp.harvard.edu/product/ISB477-PDF-ENG) లింక్‌ ద్వారా అందుబాటులో ఉంచారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్

    తాజా

    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్
    IPL 2025: ఐపీఎల్ 2025కి గ్రీన్ సిగ్నల్.. ఫైనల్ ఎప్పుడంటే..? ఐపీఎల్
    PM Modi: దాడికి ప్రతిదాడి తీవ్రంగానే ఉంటుంది.. మోదీ గట్టి హెచ్చరిక నరేంద్ర మోదీ
    APCOB: ఆప్కాబ్‌ ఛైర్మన్‌గా గన్ని వీరాంజనేయులు నియామకం తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    హైదరాబాద్

    Manchu Lakshmi: వివాదంలో మంచు లక్ష్మీ.. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కారణంగా కేసు నమోదు? టాలీవుడ్
    Miss World: భారత్‌కు నా హృదయంలో చాలా ప్రాధాన్యత ఉంది: మిస్‌ వరల్డ్‌ క్రిస్టినా పిస్కోవా  భారతదేశం
    Pasala Krishna Bharathi: స్వాతంత్య్ర సమరయోధ కుటుంబ వారసురాలు పసల కృష్ణభారతి ఇకలేరు నరేంద్ర మోదీ
    Hyderabad: షాప్ ప్రారంభోత్సవానికి పిలిచి.. బాలీవుడ్ నటిపై దాడి! బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025