
Hyderabad metro: ఈనెల 17 నుంచి పెరగనున్న హైదరాబాద్ మెట్రో రైల్ ఛార్జీలు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగర ప్రజలకు కీలకమైన సమాచారం. ఈ నెల 17వ తేదీ నుంచి మెట్రో రైల్ ప్రయాణ ఛార్జీలు పెరగనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు ప్రకటించారు.
ఇప్పటివరకు ఉన్న కనిష్ఠ టికెట్ ధర రూ.10 నుంచి రూ.12కి పెరిగినట్టు ప్రకటించగా, గరిష్ఠ టికెట్ ధర రూ.60 నుంచి రూ.75కి పెంచినట్టు తెలిపింది.
వివరాలు
పెరిగిన ఛార్జీల వివరాలు:
మొదటి రెండు స్టేషన్ల వరకూ ప్రయాణం చేస్తే:రూ.12
రెండు నుంచి నాలుగు స్టేషన్ల వరకు:రూ.18
నాలుగు నుంచి ఆరు స్టేషన్ల వరకు: రూ.30
నాలుగు నుంచి ఆరు స్టేషన్ల వరకు: రూ.30
ఆరు నుంచి తొమ్మిది స్టేషన్ల వరకు: రూ.40
తొమ్మిది నుంచి 12 స్టేషన్ల వరకు: రూ.50
12 నుంచి 15 స్టేషన్ల వరకు: రూ.55
15 నుంచి 18 స్టేషన్ల వరకు: రూ.60
18 నుంచి 21 స్టేషన్ల వరకు: రూ.66
21 నుంచి 24 స్టేషన్ల వరకు: రూ.70
24 స్టేషన్లకంటే ఎక్కువ ప్రయాణిస్తే: రూ.75
ఈ కొత్త ధరలు 17వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో మెట్రో ప్రయాణికులు తమ ప్రయాణ ఖర్చులను పునఃసమీక్షించుకోవాలి.