హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు... పలు రూట్లలో నో పర్మిషన్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై రేపటితో పదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను తెలంగాణ సర్కార్ అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది.
జూన్ 2 తొలిరోజున సచివాలయంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు.
సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లోనూ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఎన్టీఆర్ గార్డెన్స్ - ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును మూసేయనున్నారు. గన్‌పార్కు, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీగా ఉండనుంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు.
గన్‌పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఆ రూట్‌లో వాహనాలను కాసేపు నిలిపివేయనున్నారు.
June 2 Telangana Formation Celebrations
కీలకంగా మారనున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ రూట్
శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా పీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగుతల్లి జంక్షన్ వరకు ఇరువైపులా ట్రాఫిక్‌కు అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్‌పైకి వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద నుంచి షాదన్ కాలేజీ వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి జంక్షన్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్‌కు వచ్చే వాహనాలను అనుమతించరు. బీఆర్‌కేఆర్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్‌లోకి వాహనాలను అనుమతించరు. మింట్‌లైన్ నుంచి బడా గణేశ్ రూట్‌లోకి అనుమతి లేదు.
ఆఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ఆర్టీసీ బస్సులు ట్యాంక్‌బండ్‌పై కాకుండా తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్టమైసమ్మ ఆలయం, లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.