21రోజుల పాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు; ఏ రోజున ఏం చేస్తారో తెలుసుకుందాం
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను 21 రోజుల పాటు నిర్వహించాలని ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు 21 రోజుల పాటు జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి రోజు వారీ షెడ్యూల్‌ను కేసీఆర్ ఖరారు చేశారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు జూన్ 2న ప్రారంభమై జూన్ 22న ముగుస్తాయి. ఈ క్రమంలో ఏరోజున ఏం చేస్తారనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ
జూన్ 22న ప్రారంభం
జూన్ 2: జూన్ 2వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్ ప్రారంభించి ప్రసంగిస్తారు.
మంత్రులు తమ జిల్లాల్లో వేడుకలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అమరవీరులకు నివాళులు అర్పిస్తారు.
జూన్ 3: తెలంగాణ రైతు దినోత్సవం
రైతుల వేదికల వద్ద రైతులతో కలిసి ప్రజా ప్రతినిధులు సహపంక్తి భోజనాలు చేస్తారు.
జూన్ 4: సురక్షా దినోత్సవం
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జూన్ 5: తెలంగాణ విద్యుత్ వియోజత్సవం
విద్యుత్ ఉద్యోగులు, సింగరేణి ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహిస్తారు.
తెలంగామ
ప్రతి గ్రామంలో చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు
జూన్ 6: తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధి దినోత్సవం
ఇండస్ట్రీయల్, ఐటీ కారిడార్లలో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
జూన్ 7: నీటిపారుదల దినోత్సవం
సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సభలు, సమావేశాలను నిర్వహిస్తారు.
జూన్ 8: గ్రామగ్రామాన చెరువుల పండుగ
ప్రతి గ్రామంలో చెరువు కట్టలపై సహపంక్తి భోజనాలు.
జూన్ 9: తెలంగాణ సంక్షేమ సంబురాలు
సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిపొందిన వారితో సభలు, సమావేశాలు.
జూన్ 10: సుపరిపాలన దినోత్సవం
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనపై సమావేశాలు.
జూన్ 11: తెలంగాణ సాహిత్య దినోత్సవం
కవి సమ్మేళనాలు, కవితా పోటీలను నిర్వహిస్తారు.
జూన్ 12: తెలంగాణ రన్
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతో కలిసి తెలంగాణ రన్‌ను నిర్వహిస్తారు.
తెలంగాణ
18వ తేదీన నిమ్స్ విస్తరణకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన
జూన్ 13: మహిళా సంక్షేమ దినోత్సవం
మహిళా ఉద్యోగులకు సన్మానం చేయనున్నారు.
జూన్ 14: వైద్య, ఆరోగ్య దినోత్సవం
ఈ రోజున సీఎం కేసీఆర్ నిమ్స్ విస్తరణకు శంకుస్థాపన చేస్తారు.
జూన్ 15: పల్లె ప్రగతి దినోత్సవం
గ్రామాభివృద్ధిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సర్పంచులు, ఎంపీపీవలకు సన్మానం.
జూన్ 16: పట్టణ ప్రగతి దినోత్సవం
పట్టణాల అభివృద్ధికి కృషి చేసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు సన్మానం
జూన్ 17: గిరిజన దినోత్సవం
గిరిజన గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
తెలంగాణ
అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో ఉత్సవాలు ముగింపు
జూన్ 18: తాగునీటి దినోత్సవం
సురక్షితమైన తాగు నీటిని అందించడంలో తెలంగాణ ప్రభుత్వం సాధించిన విజయాలపై సభలు నిర్వహిస్తారు.
జూన్ 19: హరితోత్సవం
ఈ రోజున మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.
జూన్ 20: విద్యా దినోత్సవం
విద్యా సంస్థల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తారు.
జూన్ 21: ఆధ్యాత్మిక దినం
ప్రత్యేక పూజల, ప్రార్థనలు చేస్తారు.
జూన్ 22: అమరవీరుల సంస్మరణ దినోత్సవం
లుంబినీ పార్క్‌లో నూతన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్
జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు 21 రోజుల పాటు ఘనంగా ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు’’ #తెలంగాణదశాబ్దిఉత్సవాలు pic.twitter.com/dYWQJYlMuQ
— BRS Party (@BRSparty) May 24, 2023