Hyderabad Tsrtc : కర్ణాటక మాదిరిగా టీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణానికి 'స్మార్ట్ కార్డ్'
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కొలువుదీరనుంది. ఈ మేరకు మహాలక్ష్మి పథకం అమలు కానుంది.
ఈ క్రమంలోనే గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలో ప్రతిరోజూ 2800 ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. ఇందులో సుమారుగా 18 లక్షల మంది ప్రయాణికులు నిత్య రాకపోకలు సాగిస్తుంటారు.
ఈ నేపథ్యంలోనే మొత్తం ప్రయాణికుల్లో మహిళలు 7.2 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి రానున్న సందర్భంగా ఎంత ఖర్చు అవుతుందన్న విషయంపై ఆర్టీసీ అధికారులు లెక్కలు తీస్తున్నారు.
గ్రేటర్‌లో ఇప్పటికే రద్దీ రూట్లలో ఉదయం, సాయంత్రం 10కిపైగా మహిళా స్పెషల్ సర్వీసులను నడిపిస్తున్నారు.
details
7 వేల బస్సులు కావాలి, కానీ 2800 మాత్రమే ఉన్నాయి.
ప్రస్తుతం నగర ఆర్టీసీకి రోజుకు రూ.80 నుంచి రూ. 85 లక్షల నష్టం వస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి.ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే ఆర్టీసీపై మరింత భారం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఈ క్రమంలోనే కొత్త ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ఈవీ బస్సులను అందుబాటులోకి తెచ్చాకే మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభిస్తే సంస్థకు నష్టం తగ్గుతుందని సీనియర్ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం 7వేల బస్సులకు డిమాండ్ ఏర్పడగా,కేవలం 2800బస్సులు మాత్రమే ఉన్నాయి.గ్రేటర్‌లో రోజువారీగా సేవల కోసం ఆర్టీసీ ప్రతి రోజు 7 వేల బస్సులు నడపాల్సి ఉంది. ఈ మేరకు రవాణా రంగ నిపుణులు సూచిస్తున్నారు.
పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు రోడ్లపైకి వస్తే ప్రైవేట్ వాహనాలు తగ్గే అవకాశాలుంటాయని రవాణారంగ నిఫుణులు అభిప్రాయపడుతున్నారు.
details
కర్ణాటక మాదిరిగా శక్తి స్మార్ట్ కార్డ్
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా జూన్ 11 నుంచి శక్తి పథకం పేరుతో మహిళలకు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అమలు చేస్తోంది.
ఇందుకోసం ప్రత్యేకంగా మహిళలు స్మార్ట్ కార్డ్ (Smart card) తీసుకునేలా సింధు పోర్టల్ అందుబాటులోకి తెచ్చి ప్రత్యేక కార్డులు జారీ చేస్తోంది.
ఈ కార్డు తీసుకున్న మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచిత ప్రయాణాలు సాగించేలా సదుపాయం కల్పిస్తోంది.
ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలో రోజు 18-19 లక్షల మంది మహిళలు బస్సుల్లో ఉచిత ప్రయాణ సేవలు వినియోగించుకుంటున్నారు.