
Hydrogen-Powered Train: హైడ్రోజన్ రైలు టెస్ట్ విజయవంతం.. చెన్నైలో కొత్త అధ్యాయం ప్రారంభం!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ ఇప్పుడు డీజిల్, విద్యుత్ ఆధారిత రైళ్లను క్రమంగా తగ్గిస్తూ హైటెక్, పర్యావరణ హిత రైలు వ్యవస్థ వైపు దూసుకెళ్తోంది. ఇప్పటికే బుల్లెట్ ట్రైన్, హైపర్‌లూప్, మోనో రైలు ప్రాజెక్టులపై దృష్టి సారించిన కేంద్ర రైల్వే శాఖ.. ఇప్పుడు హైడ్రోజన్ పవర్డ్ రైళ్లు తీసుకొచ్చేందుకు వేగం పెంచుతోంది. ప్రపంచంలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, యూకే, చైనా వంటి దేశాల్లో ఇప్పటికే హైడ్రోజన్ రైళ్లు వాణిజ్య రీతిలో సేవలందిస్తున్నాయి. వీటి బాటలోనే భారత్ కూడా ఇప్పుడు ఈ టెక్నాలజీని స్వీకరిస్తోంది.
Details
చెన్నైలో మొదటి హైడ్రోజన్ రైలు కోచ్ టెస్టింగ్
భారతదేశంలో హైడ్రోజన్ శక్తితో నడిచే తొలి రైలు కోచ్‌ను తాజాగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) విజయవంతంగా పరీక్షించింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. భారత్ ప్రస్తుతం 1,200 హెచ్‌పీ సామర్థ్యం గల హైడ్రోజన్ ఇంజిన్ అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
Details
ఈ రైలు ఎలా పనిచేస్తుంది?
ఈ రైళ్లకు హైడ్రోజన్ ఫ్యూయల్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఇందులో హైడ్రోజన్, ఆక్సిజన్ కలిసినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుంది. అంటే కార్బన్ ఎమిషన్లు లేవు. శబ్దం కూడా తక్కువే. ఇవి పూర్తిగా పర్యావరణహిత రైళ్లు. ప్రత్యేకత ఏమిటంటే, ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ నింపితే వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించగలదు. కానీ దీని పని కోసం గంటకు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది.
Details
అత్యాధునిక స్పెసిఫికేషన్లు
హైడ్రోజన్ రైలు అత్యాధునిక ఫీచర్లతో నిండిన రైలు కానుంది. ఇది భారత రైల్వే చరిత్రలో ఓ మైలురాయిగా నిలవబోతోంది. పర్యావరణ పరిరక్షణతోపాటు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఇదొక గొప్ప అడుగుగా భావిస్తున్నారు. ఇదే రీతిలో విజయవంతంగా అమలు చేస్తే, భారత్ హైడ్రోజన్ రైళ్ల సేవలను కలిగి ఉన్న ప్రపంచంలోని మిగిలిన కొన్ని దేశాల సరసన నిలుస్తుంది. పచ్చదనం, ఆధునికత కలిపిన ఈ ప్రయాణం... భవిష్యత్తులో భారత రైల్వే ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే అవకాశముంది.