LOADING...
Pawan Kalyan: విజయ్‌ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
విజయ్‌ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan: విజయ్‌ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2026
11:02 am

ఈ వార్తాకథనం ఏంటి

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తమిళనాడు రాజకీయాలపై, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు సోవారం రాజమహేంద్రవరం వచ్చిన ఆయన, అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాల గురించి మాట్లాడిన పవన్ కల్యాణ్... అక్కడి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌కు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. తమిళనాడులో ఎన్నికలు ఎంతో సులభంగా జరిగాయని చెప్పిన పవన్... అక్కడి రాజకీయ పరిణామాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. నటుడు విజయ్ పార్టీ ప్రారంభించి,ఎన్నికల బరిలోకి దిగిన తీరును ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడానికి 12 ఏళ్ల సమయం

కేవలం అభిమానుల ఆదరణతోనే విజయ్ నేరుగా ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నట్లుగా కనిపిస్తోందని ఆయన నవ్వుతూ అన్నారు. అక్కడి ఎన్నికల తీరు చూసి తనకే అసూయ కలిగిందని పవన్ సరదాగా వ్యాఖ్యానించారు. పెద్దగా కష్టపడకుండా విజయ్ పార్టీ స్థాపించడం,ఎన్నికల్లో పోటీ చేయడం,రెండు ప్రధాన పార్టీలను ఎదుర్కొని విజయం సాధించడం నిజంగా ఆశ్చర్యంగా ఉందన్నారు. అందుకే విజయ్ కటౌట్లతోనే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పవచ్చని వ్యాఖ్యానించారు.అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పవన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికో రాష్ట్రం రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయని,తమిళనాడు రాజకీయాలను ఏపీతో పోల్చడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడానికి తనకు దాదాపు 12 ఏళ్ల సమయం పట్టిందని ఆయన గుర్తు చేశారు.

Advertisement