తదుపరి వార్తా కథనం
    
    
                                                                                GHMC: జీహెచ్ఎంసీ నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి
                వ్రాసిన వారు
                Sirish Praharaju
            
            
                            
                                    Oct 17, 2024 
                    
                     01:57 pm
                            
                    ఈ వార్తాకథనం ఏంటి
జీహెచ్ఎంసీ (గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్) నూతన కమిషనర్‌గా ఐఏఎస్ ఇలంబరితి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ఉద్యోగులు కమిషనర్ ఇలంబరితికి శుభాకాంక్షలు తెలిపారు. ఇలంబరితిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఇలంబరితి ప్రస్తుతం ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పని చేస్తున్న సమయంలోనే ఆయనకు ఈ అదనపు బాధ్యతలు అప్పగించబడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదివరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించిన ఐఏఎస్ ఆమ్రపాలి, ఆంధ్రప్రదేశ్‌కు రిలీవ్ కావడంతో, ఆమె స్థానంలో ఇలంబరితిని జీహెచ్ఎంసీ కమిషనర్‌గా నియమించారు. డీవోపీటీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్) ఆదేశాల మేరకు, ఆమ్రపాలి ఏపీకి వెళ్లి అక్కడే రిపోర్ట్ చేశారు.