
జమ్ముకశ్మీర్ చరిత్రను తెలిపేందుకు ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్
ఈ వార్తాకథనం ఏంటి
వేల సంవత్సరాల జమ్ముకశ్మీర్ చరిత్రను ప్రదర్శించే ఒక ఎగ్జిబిషన్‌ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్ (ఐసీహెచ్ఆర్) ఏర్పాటు చేస్తోందని హిందూస్థాన్ టైమ్స్ నివేదించింది.
'జమ్ము, కశ్మీర్, లడఖ్ త్రూ ది ఏజెస్' ఇతివృత్తంతో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది. 1947కి ముందు జమ్ముకశ్మీర్ ప్రాంతం దేశంలోని మిగిలిన ప్రాంతాలతో కలిసి లేదనే ఆరోపణలపై క్లారిటీ ఇచ్చే ఇవ్వాలనే చారిత్రక నేపథ్యంతో ఐసీహెచ్ఆర్ ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత ఐసీహెచ్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి ప్రదర్శన ఇదే.
కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన ఐసీహెచ్ఆర్ సంస్థ, సాంస్కృతిక, సాహిత్య కార్యక్రమాలకు ఆర్థిక సహాయం, ఫెలోషిప్‌ల ద్వారా చరిత్రకారులు, పండితులకు మద్దతుగా నిలబపడుతుంది.
జమ్ముకశ్మీర్
కశ్మీర్ చరిత్రను తప్పుగా చిత్రీకరించారు: ఐసీహెచ్ఆర్ చైర్‌పర్సన్ రఘువేంద్ర తన్వార్
ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశాన్ని ఐసీహెచ్ఆర్ చైర్‌పర్సన్ రఘువేంద్ర తన్వర్ వెల్లడించారు.
కశ్మీర్ నిజమైన చరిత్రను విదేశీ రచయితలు, భారతదేశంలోని కథకులు, పండితులు కొందరు తప్పుగా చిత్రీకరించారని వెల్లడించారు.
1947 తర్వాత కశ్మీర్ ఎలా అభివృద్ధి చెందిందో చాలా మంది ప్రజలు తెలుసునని, భారతదేశం నాగరికత వేల సంవత్సరాల చరిత్ర ఉందని, కశ్మీర్ దానిలో అంతర్భాగంగా ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ ఎగ్జిబిషన్‌ను రాజకీయ కోణంలో కాకుండా సాంస్కృతిక, చారిత్రక, సాహిత్య కోణంలో జమ్ముకశ్మీర్ చూస్తోందని తన్వర్ అన్నారు.
ఈ ప్రదర్శనలో గ్రంథాలు, వాస్తుశిల్పం, వాణిజ్యం, హరప్పా నాగరికత, కాశ్మీర్ అంతటా ఋషులు ఎలా నడిచారు అనే విషయాలను తెలిపే ఆధారాలను ఉంచుతామని చెప్పారు.