
Telangana Police: మత్తు పదార్థాలు వినియోగిస్తే లైసెన్సు రద్దు.. న్యూయర్ వేడుకలపై పోలీసుల హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు అలర్ట్ అయ్యారు.
పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ఈవెంట్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టారు. నార్కోటిక్స్ బ్యూరో, ఎక్సైజ్ అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.
వేడుకల్లో మత్తు పదార్థాల వినియోగం జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీచేశారు. మత్తు పదార్థాలు ఫ్రీ వేడుకల నిర్వహణకు అండర్‌టేకింగ్ తీసుకున్నారు.
మత్తు పదార్థాలు దొరికితే బార్లను సీజ్ చేయడంతో పాటు లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఆమోదిత సమయానికి మాత్రమే పబ్‌లు, బార్‌లు నిర్వహించాలనీ, మందు సరఫరాను కూడా సమయపాలన ప్రకారం చేయాలని సూచించారు.
Details
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు
ఏ చిన్న అలసత్వం జరిగినా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ప్రకటన ప్రకారం, మత్తు పదార్థాల నిర్మూలన లక్ష్యంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
గంజాయి, మత్తుపదార్థాలు ఎక్కువగా వినియోగించే ప్రాంతాలను గుర్తించి ఆపరేషన్ ధూల్ పేట్ నిర్వహించారు.
రాష్ట్రంలో నార్కోటిక్ మత్తు పదార్థాల నియంత్రణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
పోలీసుల కఠిన చర్యలతో నూతన సంవత్సర వేడుకలను నగరంలో మత్తు పదార్థాల ఫ్రీగా నిర్వహించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.