V. Kamakoti: ఫ్రెషర్‌గా మారిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్.. విద్యార్థులకు ఊహించని సర్‌ప్రైజ్!
ఈ వార్తాకథనం ఏంటి
ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి కొత్త విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికి అందరి ప్రశంసలు అందుకున్నారు. సాధారణంగా డైరెక్టర్‌గా వేదికపైకి వచ్చి ప్రసంగించడం బదులుగా,ఈసారి ఆయన ఫ్రెషర్ విద్యార్థి వేషంలో క్యాంపస్‌లోకి వచ్చి కొత్తగా చేరిన విద్యార్థుల మధ్యే కలిసిపోయారు. సాధారణ దుస్తులు ధరించి,తొలి సంవత్సరం విద్యార్థిలా వారితో కలిసి కూర్చోవడంతో అక్కడున్న వారిలో చాలా మందికి ఆయన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ అని అక్కడున్న విద్యార్థులు గుర్తించలేకపోయారు. ఓరియెంటేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో ప్రొఫెసర్ కామకోటి వేదికపైకి వెళ్లి తానే ఐఐటీ మద్రాస్ డైరెక్టర్‌నని పరిచయం చేసుకోవడంతో సభలో ఉన్న విద్యార్థులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే చప్పట్లతో, నవ్వులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు.
వివరాలు
విద్యార్థులలో సంకోచాన్ని పోగొట్టేలా, ఆత్మీయ వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఈ వినూత్న ఆలోచన..
ఈ సందర్భంగా మాట్లాడుతూ, "వయసు పెరుగుతోంది. గతంలో అయితే ఈ ప్రాంక్‌ను ఇంకా ఎక్కువసేపు కొనసాగించగలిగేవాడిని" అంటూ సరదాగా వ్యాఖ్యానించగా విద్యార్థులు హర్షధ్వానాలు చేశారు.
కొత్త విద్యార్థులకు కేవలం అధికారిక ప్రసంగం చేయడం కంటే, వారిలో ఉన్న సంకోచాన్ని పోగొట్టేలా, ఆత్మీయ వాతావరణాన్ని కల్పించే ఉద్దేశంతోనే ఈ వినూత్న ఆలోచనను అమలు చేసినట్లు తెలుస్తోంది.
దీంతో విద్యార్థులు కళాశాల జీవితాన్ని మరింత ఆత్మవిశ్వాసంతో ప్రారంభించేలా ప్రోత్సాహం లభించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులతో సాన్నిహిత్యం, అందుబాటులో ఉండే నాయకత్వం, స్వేచ్ఛాయుత క్యాంపస్ వాతావరణానికి ఐఐటీ మద్రాస్ ప్రాధాన్యం ఇస్తోందనే సందేశం స్పష్టంగా కనిపించింది.
సాధారణ ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని ఈ సర్‌ప్రైజ్ మరింత ఉత్సాహభరితంగా, చిరస్మరణీయంగా మార్చింది.
వివరాలు
సోషల్ మీడియాలో వైరల్‌గా ఈ వీడియో
ఈ ప్రాంక్‌ను ప్రొఫెసర్ కామకోటి, ఐఐటీ మద్రాస్ స్టూడెంట్ అఫైర్స్ బృందం కలిసి రహస్యంగా ప్రణాళిక రూపొందించారు.
చివరి క్షణం వరకు కొత్త విద్యార్థులకు ఈ విషయాన్ని తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో, అసలు విషయం బయటపడిన సమయంలో అందరూ మరింత ఆశ్చర్యపోయారు.
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డైరెక్టర్ నిరాడంబరత, విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగడం, అందుబాటులో ఉండే నాయకత్వాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
ఐఐటీ మద్రాస్ ప్రత్యేక క్యాంపస్ సంస్కృతిని ప్రతిబింబించిన ఈ వినూత్న స్వాగతం, కొత్త విద్యార్థులకు తమ కళాశాల జీవితాన్ని మరపురాని అనుభూతితో ప్రారంభించే అవకాశాన్ని కల్పించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రాంక్‌తో కొత్త విద్యార్థులను ఆశ్చర్యపరిచిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి
IIT Madras Director goes undercover as student to prove a point!! Watch till the last.. pic.twitter.com/KHjHtBXkTY
— IIT Madras BS Programs (@iitm_bs) July 27, 2026