Page Loader
ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక 
ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక

ఐకియా స్టోర్‌లో కస్టమర్‌కు చేదు అనుభవం; ఫుడ్ కోర్ట్‌లో తింటుండగా పైనుంచి పడిన చచ్చిన ఎలుక 

వ్రాసిన వారు Stalin
Jul 18, 2023
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని ఐకియా స్టోర్‌లోని ఒక మహిళా కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. శరణ్యశెట్టి అనే యువతి ఇన్‌హౌస్ ఫుడ్ కోర్ట్‌లో తన స్నేహితులతో కలిసి ఫుడ్ తింటుండంగా పై నుంచి అనూహ్యంగా చచ్చిపోయిన ఎలుక టైబుల్‌పై పడిపోయింది. దీంతో అవాక్కయిన ఆమె ఆ ఫోటోలను తీసింది. శరణ్యశెట్టి స్నేహితురాలు మాయ ఈ ఫోటోలను ట్వీట్టర్‌లో షేర్ చేశారు. టేబుల్‌పై ఉన్న ఎలుక పడి ఉన్న చిత్రాలను పంచుకుంటూ తాము స్నాక్స్ తింటుండగా ఏం జరిగిందో చూడండి అంటూ మాయ పేర్కొన్నారు. అయితే ఈ ట్వీట్‌పై స్పందించిన ఫర్నిచర్ రిటైలర్ ఐకియా స్పందించింది. లోపాలను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ అసహ్యకరమైన సంఘటనకు తాము క్షమాపణలు కోరుతున్నట్లు ట్వీట్ చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్షమాపణలు కోరుతూ ఐకియా చేసిన ట్వీట్