
Hyderabad Traffic: గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ట్రాఫిక్ అధికారులు హైదరాబాద్ వాసులకు సురక్షితంగా ప్రయాణించేందుకు ముందస్తు అలర్ట్ జారీ చేశారు.
ఇక వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.
దీంతో ఈ నెల 10 నుండి 16వ తేదీ వరకు గణేష్ విగ్రహ నిమజ్జన ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు.
1)కర్బలా మైదాన్ నుంచి వచ్చే వాహనాలను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించరు
2)సెయిలింగ్ క్లబ్ నుండి కవాడిగూడ క్రాస్ రోడ్లు వైపునకు ట్రాఫిక్ మళ్లించారు.
3)పంజాగుట్ట, రాజ్‌భవన్ నుంచి వెళ్లే వాహనాలు ఎన్టీఆర్ మార్గం నుండి వెళ్లాలి.
Details
వాహనాల దారులు పాటించాల్సిన నియమాలు ఇవే
4)పీవీఎన్‌ఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీదుగా కాకుండా, షాదన్ కాలేజీ, లక్డీ-కా-పుల్ వైపు మళ్లిస్తారు
5)అంబేద్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గం వైపు అనుమతించరు. అవి ఇక్బాల్ మినార్ వైపు నుండి మళ్లిస్తారు.
6)ఇక్బాల్ మినార్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు కట్ట మైసమ్మ దేవాలయం, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
7)కట్ట మైసమ్మ దేవాలయం నుండి చిల్డ్రన్స్ పార్క్ వైపు ట్రాఫిక్‌ను అనుమతించరు. వాటిని డీబీఆర్ మిల్స్, కవాడిగూడ వైపు మళ్లిస్తారు.
Details
ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు పాటించాలి
8)ముషీరాబాద్, జబ్బార్ కాంప్లెక్స్ నుండి వచ్చే వాహనాలు సెయిలింగ్ క్లబ్ వైపు అనుమతించరు. వాటిని డీబీఆర్ మిల్స్ వైపు మళ్లిస్తారు.
9)మినిస్టర్స్ రోడ్డు నుండి వచ్చే వాహనాలు పీవీఎన్‌ఆర్ మార్గం వైపు లేదా నల్లగుట్ట బ్రిడ్జి వద్దకు మళ్లిస్తారు.
10) బుద్ధ భవన్ నుండి వచ్చే వాహనాలను పీవీఎన్‌ఆర్ మార్గం వైపు అనుమతించకుండా నల్లగుట్ట బ్రిడ్జి వద్ద మినిస్టర్ రోడ్డు వైపు మళ్లిస్తారు.