Page Loader
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు 
విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు

విజయవాడ దుర్గగుడి పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు 

వ్రాసిన వారు Stalin
Jan 29, 2024
06:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ కనకదుర్గ గుడి పాలకమండలి సమావేశం సోమవారం జరగ్గా.. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇంద్రకీలాద్రిపై పూజా మండపాల నిర్మాణానికి పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి నిర్ణయాలను ఆయజ చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. కనకదుర్గ గుడిలో ఎలివేటెడ్ క్యూలైన్స్ ఏర్పాటుకు కూడా పాలకమండలి ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. అలాగే, ఫిబ్రవరి 18వ నుంచి మల్లేశ్వరస్వామి ఆలయ దర్శనం మొదలుకానున్న నేపథ్యంలో.. లైటింగ్ ఏర్పాటుకు పాలకమండలి ఆమోదం తెలిపింది.

గుడి

గుడి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తాం: కర్నాటి రాంబాబు 

సీఎం జగన్ ఆదేశాలతో విజయవాడ కనకదుర్గ గుడి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని కర్నాటి రాంబాబు అన్నారు. ఇకపై వీవీఐపీ భక్తులు, వృద్ధులు, దివ్యాంగులు రోజూ ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30వరకు దర్శనాన్ని వాయిదా వేసుకోవాలన్నారు. దసరా నాటికి మాస్టర్ ప్లాన్‌లోని అన్ని అంశాలను పూర్తి చేస్తామన్నారు. దుర్గగుడి అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదన్నారు. గిరిప్రదక్షిణ మార్గంలో దుర్గ గుడి భక్తులకు ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.