
పాడేరులో ఘోర ప్రమాదం.. 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన ఆర్డీసీ బస్సు; నలుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే చనిపోయినట్లు అధికారులు తెలిపారు.
చోడవరం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం సాయంత్రం ప్రమాదానికి గురైంది.
ఘాట్ రోడ్డు వ్యూపాయింట్ వద్ద చెట్టు కొమ్మను క్రాస్ చేయబోయి డ్రైవర్ నియంత్రణను కోల్పోవడంతో బస్సు దాదాపు 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 45 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10మందికి తీవ్రగాయాలు కాగా, 18 మందికి స్వల్ప గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు.
క్షతగాత్రులను పాడేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మృతుల సంఖ్య పెరిగే అవకాశం
చోడవరం నుండి పాడేరు వెళ్లే ఆర్టీసీ బస్సు లోయలో అదుపు తప్పి పడిపోయింది...
— M9.NEWS (@M9Breaking) August 20, 2023
బస్సు లో 50 మంది ప్రయాణికులు#AndhraPradesh pic.twitter.com/Phny94pd1m