Page Loader
Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు 
యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు

Sanatan Dharma Row: యూపీలో ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేపై కేసు నమోదు 

వ్రాసిన వారు Stalin
Sep 06, 2023
01:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

మతపరమైన భావాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదైంది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్‌ పిలుపునివ్వడం, అతని వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చినందుకు ఖర్గేపై న్యాయవాదులు హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్లు 295 ఏ (ఉద్దేశపూర్వకంగా, ద్వేషపూరిత చర్యలు), 153 ఏ (వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం) కింద కేసు నమోదు చేశారు. మీడియా నివేదికల ఆధారంగా హర్ష్ గుప్తా, రామ్ సింగ్ లోధి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఉదయనిధి, ప్రియాంక్ ఖర్గే‌పై నమోదైన ఎఫ్ఐఆర్