
Helpline: గాజాలోని భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
గాజా నుంచి ఇజ్రాయెల్‌పై హమాస్ గ్రూపు ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో హమాస్ గ్రూప్ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ దాడులను తీవ్రతరం చేసింది.
ఈ నేపథ్యంలో పాలస్తీనాలోని మన దేశ పౌరుల కోసం భారతదేశం 24 గంటల హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది.
భారతీయుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు టెల్ అవీవ్‌లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.
ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితుల దృష్ట్యా పాలస్తీనాలోని భారతీయ పౌరులు 24 గంటల ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్‌లో ఏదైనా అత్యవసర సహాయం కోసం నేరుగా ఇండియన్ ఎంబసీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చని ట్విట్టర్‌లో వేదికంగా వెల్లడించింది.
ముఖ్యంగా గాజాలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలని రమల్లాలోని భారత కార్యాలయం పేర్కొంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పాలస్తీనాలోని భారత రాయబార కార్యాలయం ట్వీట్
Public Notice
— India in Palestine - الهند في فلسطين (@ROIRamallah) October 11, 2023
Emergency Helpline for Indian Diaspora pic.twitter.com/5Z1Q7U71nX