Loading...
Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..

Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆగస్టు 15 వేడుకలకు మరో రెండు రోజులు మాత్రమే ఉండటంతో పలు ప్రాంతాల్లో జాతీయ జెండాలు రెపరెపలాడనున్నాయి. అయితే జాతీయ జెండాను ఎగరవేసే సమయంలో కొన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జాతీయ జెండాను ఖాదీ, సిల్క్ లేదా కాటన్ వస్త్రంతో మాత్రమే తయారు చేయాలి. జెండా పొడవు, వెడల్పు 3:2 నిష్పత్తిలో ఉండాలి. నిబంధనల ప్రకారం వివిధ పరిమాణాల్లో మొత్తం 9 రకాల జెండా సైజులు ఉన్నాయి. ఆ నిర్దేశిత పరిమాణాలకు అనుగుణంగానే జాతీయ జెండాలను తయారు చేయాలి.

వివరాలు

మూడు రంగులు సమాన కొలతల్లో ఉండాలి..

చిన్న పరిమాణంలో జేబుకు పెట్టుకునేందుకు పేపర్ జెండాలను ఉపయోగించవచ్చు.

అయితే పెద్ద పరిమాణంలో పేపర్ జెండాలను ఉపయోగించకూడదు.

జాతీయ జెండాలోని కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు సమాన కొలతల్లో ఉండాలి.

తెలుపు రంగు మధ్యలో నీలిరంగులో అశోకచక్రం ఉంటుంది. అందులో 24 ఆకులు ఉండాలి.

వివరాలు

పాటించాల్సిన నియమాలివేే..

జాతీయ జెండాను సూర్యోదయం తర్వాత ఎగరవేయాలి. సూర్యాస్తమయం కంటే ముందే జెండాను కిందకు దించాలి.

జాతీయ జెండాపై ఎలాంటి రాతలు, అక్షరాలు లేదా ఇతర గుర్తులు ఉండకూడదు.

అలాగే జెండా నేలను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నీటిలో పడకుండా కూడా చూసుకోవాలి.

ఒకవేళ జాతీయ జెండాతో పాటు ఇతర జెండాలను కూడా ఏర్పాటు చేస్తే.. జాతీయ జెండాను వాటి కంటే కొంచెం ఎత్తులో ఉంచాలి.

అంతేకాకుండా ఇతర జెండాల కంటే కొద్దిగా ముందువరుసలో ఉండేలా ఏర్పాటు చేయాలి.

అందువల్ల స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసే ప్రతి ఒక్కరూ ఈ నిబంధనలను తప్పకుండా పాటించి జెండాకు గౌరవం ఇవ్వాలి.

ADVERTISEMENT