LOADING...
INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే 
'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే

INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే 

వ్రాసిన వారు Stalin
Jul 19, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిపక్షాలు తమ కూటమి పేరును ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్( ఇండియా-INDIA)గా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నఇండియా కూటమికి ట్యాగ్‌లైన్‌ను కూడా నిర్ణయించారు. కొత్త కూటమికి 'జీతేగా భారత్' అనే ట్యాగ్ లైన్‌ను ఫైనల్ చేశారు. సుధీర్ఘ చర్చల తర్వాత జీతేగా భారత్ (భారత్ గెలుస్తుంది)పై తుది నిర్ణయం తీసుకున్నారు. బెంగళూరులో మంగళవారం జరిగిన సదస్సులో 26 ప్రతిపక్ష పార్టీల నాయకులు కూటమికి I.N.D.I.A - ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టినప్పుడే, ట్యాగ్ టైన్‌లో కూడా 'భారత్' అనే పదం ఉండాలని భావించారు. ఈ క్రమంలోనే 'జీతేగా భారత్'ను ఖరారు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 ఇండియా కూటమికి ట్యాగ్ లైన్ ఖరారు