VanDyke: నా అరెస్టు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భాగమే: వాన్‌డైక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో తన అరెస్టు వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా మాజీ సైనికుడు, కిరాయి సైనికుడు మాథ్యూ వాన్‌డైక్ ఆరోపించారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో భాగంగానే తనను భారత్‌లో అరెస్టు చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి రాబోయే కొన్ని నెలల్లో విస్తుపోయే విషయాలను బయటపెడతానని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా పోస్టు చేశారు. మార్చి 13న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మాథ్యూ వాన్‌డైక్‌తో పాటు ఆరుగురు ఉక్రెయిన్ పౌరులను అరెస్టు చేసింది. మయన్మార్‌లోని జాతి సాయుధ బృందాలకు ఆయుధాల వినియోగం, డ్రోన్ యుద్ధతంత్రంలో శిక్షణ ఇచ్చారనే ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు
ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలు అవాస్తవం
తన విడుదల కోసం అమెరికా ప్రభుత్వం భారత్‌పై ఒత్తిడి తెచ్చిందన్న వాదనలను వాన్‌డైక్ తోసిపుచ్చారు.
భారత్‌లోకి ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చారంటూ ఓ సోషల్ మీడియా వినియోగదారు అడిగిన ప్రశ్నపైనా స్పందించారు.
భారత ప్రభుత్వం తనపై ఎప్పుడూ అలాంటి ఆరోపణలు చేయలేదని స్పష్టం చేశారు.
భారత్ విడిచి వెళ్లేందుకు తాను వ్యక్తిగతంగా అనుమతి కోరలేదని, తన తరఫు న్యాయవాదులే ఆ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.
వివరాలు
సెప్టెంబర్‌లో డిఫాల్ట్ బెయిల్ పొందిన వాన్‌డైక్
వాన్‌డైక్‌ను కోల్‌కతా విమానాశ్రయంలో అరెస్టు చేయగా, ఉక్రెయిన్ పౌరులను ఢిల్లీ, లక్నో విమానాశ్రయాల్లో అదుపులోకి తీసుకున్నారు.
అవసరమైన అనుమతులు లేకుండానే వారు మిజోరంలోకి ప్రవేశించారని, అక్కడి నుంచి మయన్మార్‌కు వెళ్లి ఆయుధాల వినియోగం, డ్రోన్ యుద్ధతంత్రంలో శిక్షణ ఇచ్చారని ఎన్‌ఐఏ ఆరోపించింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) ప్రకారం నిర్ణీత గడువులోగా ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో సెప్టెంబర్ 18న వాన్‌డైక్‌కు డిఫాల్ట్ బెయిల్ లభించింది.
రౌస్ అవెన్యూ కోర్టు వ్యక్తిగత పూచీకత్తుతో పాటు రూ.లక్ష చొప్పున ఇద్దరు ష్యూరిటీలను సమర్పించాలనే షరతుతో బెయిల్ మంజూరు చేసింది.
వివరాలు
వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు
సెప్టెంబర్ 24న వాన్‌డైక్ తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. తదుపరి విచారణలకు ఢిల్లీలో హాజరవుతాననే షరతుతో నెల రోజుల పాటు అమెరికా వెళ్లేందుకు కోర్టు అనుమతించింది.
2027 ఫిబ్రవరిలో కోర్టు విచారణల కోసం భారత్‌కు తిరిగి వస్తానని వాన్‌డైక్ తెలిపారు. అయితే ఇతరులు ఊహిస్తున్న కారణాలతో తాను భారత్‌కు రావడం లేదని స్పష్టం చేశారు.