Loading...
India-China Border: చైనా సరిహద్దులో ఇంకా ఘర్షణలు.. ఐటీబీపీ చీఫ్ కీలక ప్రకటన
చైనా సరిహద్దులో ఇంకా ఘర్షణలు.. ఐటీబీపీ చీఫ్ కీలక ప్రకటన

India-China Border: చైనా సరిహద్దులో ఇంకా ఘర్షణలు.. ఐటీబీపీ చీఫ్ కీలక ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2026
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

చైనా సరిహద్దు వెంబడి భారత్‌కు, చైనాకు మధ్య ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోందని ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌ (ఐటీబీపీ) డీజీ శత్రుజీత్ కపూర్ వెల్లడించారు. ముఖ్యంగా అరుణాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దులో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ఘర్షణలను ధ్రువీకరిస్తూ వెలువడిన తొలి ప్రకటన ఇదే కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ''అరుణాచల్‌ప్రదేశ్‌ సరిహద్దులోని పలు ప్రాంతాల్లో గత కొన్నిరోజులుగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఐటీబీపీకి చెందిన శౌర్య కమాండోలు అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నారు'' అని శత్రుజీత్ కపూర్ పేర్కొన్నారు. ఐటీబీపీ సిబ్బంది సేవలను గుర్తిస్తూ ప్రతి ఏటా నిర్వహించే సన్మాన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

వివరాలు 

3,488 కిలోమీటర్ల పొడవైన ఎల్‌ఏసీ వెంబడి ఐటీబీపీ సిబ్బంది పహారా

పర్వత ప్రాంతాల్లో పోరాడే గెరిల్లా దళంగా ఐటీబీపీని తొలుత ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.

2004లో చైనా సరిహద్దు భద్రత బాధ్యతలను ఈ దళానికి అప్పగించినట్లు తెలిపారు. చైనా సరిహద్దు అత్యంత క్లిష్టమైనదని ఆయన అంగీకరించారు.

గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణల తరహా పరిస్థితులను మరింత సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు.

అలాగే భూగర్భ మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

భారత్‌-చైనా మధ్య 3,488 కిలోమీటర్ల పొడవైన వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఐటీబీపీ సిబ్బంది పహారా కాస్తుంటారు.

ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఎదురయ్యే ఘర్షణలను సమర్థంగా ఎదుర్కోవడం ఐటీబీపీ శౌర్య కమాండోల ప్రత్యేకత.

ADVERTISEMENT