LOADING...
India, China:ఈ నెల్లోనే భారత్,చైనా మధ్య నేరుగాప్రత్యక్ష విమాన సర్వీసులు!
ఈ నెల్లోనే భారత్,చైనా మధ్య నేరుగాప్రత్యక్ష విమాన సర్వీసులు!

India, China:ఈ నెల్లోనే భారత్,చైనా మధ్య నేరుగాప్రత్యక్ష విమాన సర్వీసులు!

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
12:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆగిపోయిన అంతర్జాతీయ విమానసేవలు, అలాగే గల్వాన్‌ లోయలో ఏర్పడిన భౌగోళిక,రాజకీయ ఉద్రిక్తతల సుదీర్ఘ విరామం తర్వాత భారత్, చైనా మధ్య విమాన రవాణా సేవలు తిరిగి ప్రారంభం కావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు ఇరుదేశాల మధ్య ఐదేళ్ల నుంచి ఆగిపోయిన భారత్, చైనా నేరుగా విమానసర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ మేరకు భారత్‌-చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

భారత్-చైనా మైత్రీకి కొత్త దిశ

వాణిజ్య, ఆర్థిక ఒత్తిళ్ల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ప్రవేశపెట్టిన టారిఫ్ విధానాల వల్ల ఇరు దేశాల ఆర్థిక సంబంధాలు సవాళ్లకు లోనయ్యాయి. ఈ పరిస్థితి మధ్య, భారత్, చైనా రెండూ ఒకరికొకరు సానుకూల సంకేతాలు పంపిస్తూ, తిరిగి స్నేహభరిత సంబంధాలను పునర్నిర్మించుకోవాలని సంకల్పించాయి. ఈ ప్రయత్నాల్లో ఒక భాగంగా నేరుగా విమానసేవలను ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.

వివరాలు 

గల్వాన్‌ ఘర్షణ: సంబంధాలకు ఒక అడ్డంకి 

2020 మే నెలలో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో భారత్, చైనా సైనికుల మధ్య ఉద్రిక్తత మొదలై, జూన్‌లో గల్వాన్‌ లోయలో ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో ఉభయ పక్షాల సైనికులు ప్రాణాలను కోల్పోయారు. తర్వాత ఈ ప్రాంతంలో భారీ సైనిక సన్నాహాలు, భౌగోళిక వాదనలు, కఠిన జవాబు చర్యలు జరిగాయి. దీని ఫలితంగా సరిహద్దు ప్రాంతంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తతకుగావించి, ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య,పౌర సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడింది. పాస్‌పోర్ట్‌లు, దిగుమతులు, అనుమతులు వంటి అనేక రంగాల్లో పరిమితులు ఏర్పడాయి.

వివరాలు 

పునర్ మైత్రి  కోసం బలమైన సంకల్పం 

అమెరికా టారిఫ్‌ల కారణంగా ఎదురైన ఆర్థిక ఇబ్బందులను దూరం చేసేందుకు, భారత్, చైనా కలిసి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ సంకల్పానికి ఉదాహరణగా, చైనా జాతీయులకు పర్యాటక వీసాలు ఇచ్చేందుకు భారత ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇరు దేశాల నాయకులు పరస్పర సంబంధాలను బలోపేతం చేసేందుకు కొత్త దిశలో చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. సుమారు ఏడేళ్ల తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో పర్యటనకు సిద్ధమవుతున్నారని భావించబడుతోంది. ప్రధాని మోదీ ఇటీవల ప్రకటించిన విధంగా, చైనాతో స్నేహ బంధం బలపడాలని,ఆర్థిక, రాజకీయ స్థాయిలో సంబంధాలను మరింత దృఢం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.

వివరాలు 

చైనాతో మైత్రీ బంధాన్ని బలోపేతం చేయడానికి ముఖ్య నిర్ణయాలు 

అమెరికా విధిస్తున్న టారిఫ్‌లపై చైనా సైతం పరోక్ష విమర్శ వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య నెమ్మదిగా ఏర్పడుతున్న ఈ సానుకూల వాతావరణంలో నేరుగా విమానసర్వీసులను పునరుద్ధరించడం ద్వారా మైత్రీ బంధాన్ని మరింత స్థిరం చేయడానికి భారత్ ప్రయత్నిస్తోంది. చివరిసారిగా 2018 జూన్‌లో ప్రధాని మోదీ చైనాలో పర్యటించారు. ఆ తర్వాతి సంవత్సరం అక్టోబర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌లో పర్యటించారు. ఈ మధ్యనే టియాన్‌జిన్‌లో నిర్వహించిన 25వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖర సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. సదస్సులో ఇరు దేశాల మధ్య వివిధ కీలక అంశాలపై చర్చలు జరిగాయి, అందులో నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ ఒక ప్రధాన అంశంగా నిలిచింది.