LOADING...
Randhir Jaiswal: జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం
జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం

Randhir Jaiswal: జమ్ముకశ్మీర్‌పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2026
08:31 am

ఈ వార్తాకథనం ఏంటి

చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారత్‌లో విడదీయరాని భాగాలని, వాటిపై వ్యాఖ్యానించే హక్కు ఇతర దేశాలకు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చైనాలో పర్యటించిన తర్వాత, మే 25న చైనా-పాకిస్థాన్ దేశాలు ఉమ్మడి ప్రకటన చేశాయి. అందులో జమ్మూకశ్మీర్‌ను "చరిత్రలో మిగిలిపోయిన వివాదం"గా పేర్కొనడాన్ని భారత్ తప్పుబట్టింది. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలు ఎప్పటికీ భారత్‌లోనే కొనసాగుతాయని రణ్‌ధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.

వివరాలు 

చైనా-పాక్ మధ్య జలాల సహకారం ప్రస్తావనను తోసిపుచ్చిన భారత్

చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)ప్రాజెక్టులపై కూడా భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించిన పాకిస్థాన్ చర్యలకు చట్టబద్ధత కల్పించే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని తెలిపింది. అలాగే, చైనా-పాకిస్థాన్ మధ్య సరిహద్దు జలవనరుల సహకారం అంశాన్ని కూడా భారత్ తోసిపుచ్చింది. ఆ రెండు దేశాల మధ్య ఉమ్మడి సరిహద్దు లేనప్పుడు అలాంటి సహకారం ప్రశ్నే తలెత్తదని విదేశాంగ శాఖ పేర్కొంది. ఇంకా, షక్స్‌గామ్ లోయను చైనాకు అప్పగిస్తూ 1963లో కుదిరిన సరిహద్దు ఒప్పందాన్ని భారత్ ఎన్నడూ గుర్తించలేదనిని మరోసారి స్పష్టం చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కశ్మీర్ అంశంపై చైనా-పాక్‌కు భారత్ గట్టి హెచ్చరిక

Advertisement