
Chenab Water: పాకిస్థాన్ కి చీనాబ్ నీళ్లు బంద్.. సలాల్ జలాశయం గేట్లు మూసివేత..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జలవివాదం మరింత ముదిరుతోంది.
ఇప్పటికే సింధూ జల ఒప్పందాన్ని నిలిపివేసిన భారత్, తాజాగా చీనాబ్ నదిపై నిర్మించిన సలాల్ జలాశయానికి గేట్లను మూసివేసింది.
దీని ప్రభావంగా చుక్క నీరైన పారక నదీ పరివాహక ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
ఈ పరిస్థితిని చూసి, భారత్ పాక్‌పై ఆయుధాలతో కాకుండా 'జలయుద్ధం' చేస్తున్నదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ డ్యామ్ ద్వారా భారత్ పాకిస్థాన్‌కు పంపాల్సిన నీటిని నిలిపివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఇదే సమయంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా రిజర్వాయర్ ద్వారా కూడా నీటి సరఫరా నిలిపివేయాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం లభించింది.
వివరాలు
మొట్టమొదటి మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టు
భారత్ ఈ విధంగా'జలఖడ్గం'ప్రయోగిస్తుండటంతో పాక్ దిగ్భ్రాంతికి గురవుతోంది.
దీనికి ప్రతిస్పందనగా పాకిస్థాన్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ,రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఇటీవలే పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ, "భారత్ పాకిస్థాన్‌కు వచ్చే నదులపై ఏవైనా నిర్మాణాలు చేపడితే,అవన్నీ ధ్వంసం చేస్తాం. అవసరమైతే అణుదాడికి కూడా వెనుకాడమం" అని హెచ్చరించారు.
ఇక, వాయువ్య హిమాలయాల్లోని గురేజ్ లోయలో ఉన్న కిషన్‌గంగా డ్యామ్.. అక్కడి మొట్టమొదటి మెగా హైడ్రో పవర్ ప్రాజెక్టుగా నిలుస్తోంది.
ఈ డ్యామ్‌లో నిర్వహణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.వాటి కారణంగా దిగువకు వెళ్లే నీటి ప్రవాహం పూర్తిగా నిలిచే అవకాశం ఉంది.
ఈ రెండు డ్యాముల నిర్మాణ డిజైన్లపై పాకిస్థాన్ ఇప్పటికే తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది.