Page Loader
India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 
గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్

India humanitarian aid: గాజాకు మానవతా సాయం.. విమానంలో మెడికల్ కిట్లు, సహాయ సమాగ్రిని పంపిన భారత్ 

వ్రాసిన వారు Stalin
Oct 22, 2023
12:31 pm

ఈ వార్తాకథనం ఏంటి

హమాస్ మిలిటెంట్లు-ఇజ్రాయెల్ సైన్యం యుద్ధం నేపథ్యంలో గాజా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో గాజా ప్రజలకు ఆదుకునేందుకు భారత్ మానవతా సాయం కింద ఒక ప్రత్యేక విమానంలో మెడికల్ కిట్లు, విపత్తు సహాయ సామగ్రిని పంపింది. ఈ విమానం ఈజిప్టు మీదుగా గాజాకు చేరుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు. విమానంలో 6.5టన్నుల మెడికల్ కిట్లు, 32టన్నుల విపత్తు సహాయ సామగ్రి ఉన్నట్లు చెప్పారు. శస్త్రచికిత్స వస్తువులు, టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్‌లు, టార్పాలిన్‌లు, శానిటరీ యుటిలిటీలు, నీటి శుద్దీకరణ మాత్రలు, ఇతర వస్తువులు ఆ విమానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన 3రోజుల తర్వాత భారత్ మానవతా సాయాన్ని అందించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి చేసిన ట్వీట్