Loading...
Hydrogen Train: తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రారంభించిన ప్రధాని .. జింద్-సోనిపట్ మార్గంలో సేవలు
జింద్-సోనిపట్ మార్గంలో సేవలు

Hydrogen Train: తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రారంభించిన ప్రధాని .. జింద్-సోనిపట్ మార్గంలో సేవలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఉత్తర రైల్వే పరిధిలోని హర్యానా రాష్ట్రంలోని జింద్-సోనిపట్ మధ్య 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలు సేవలు అందించనుంది. ఈ ప్రాజెక్టుతో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని భారత రైల్వే తొలిసారిగా వినియోగంలోకి తీసుకొచ్చింది. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి రైలును నడిపే ఈ సాంకేతికత డీజిల్ ఇంజిన్లకు పర్యావరణహిత ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా హైడ్రోజన్ నిల్వ, ఇంధనం నింపే ప్రత్యేక రీఫ్యూయలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు.

వివరాలు 

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లు 

రైలు ప్రారంభానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో స్పందిస్తూ.. హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టిన కొద్ది దేశాల సరసన భారత్ చేరిందని పేర్కొన్నారు.

రైల్వే రంగంలో స్వచ్ఛమైన సాంకేతికతను ప్రోత్సహించే దిశగా ఇది కీలక ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుతం ఈ రైలును ప్రయోగాత్మక ప్రాజెక్టుగా అభివృద్ధి చేశారు.

భవిష్యత్తులో దేశవ్యాప్తంగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలను అంచనా వేసేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తొలి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

ADVERTISEMENT

వివరాలు 

హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు

ఈ హైడ్రోజన్ రైలు మొత్తం 10 బోగీలతో రూపొందించారు. 1,200 కిలోవాట్ల సామర్థ్యమున్నహైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది.

గరిష్ఠంగా గంటకు 75కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు అనుమతి లభించగా,దీని రూపకల్పన వేగం గంటకు 110కిలోమీటర్లు. సుమారు 2,600మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణించే సామర్థ్యం ఉంది.

డిజైన్ దశ నుంచి ప్రోటోటైప్ తయారీ వరకు ఈ రైలును పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు.

జింద్ జంక్షన్,గోహానా జంక్షన్,సోనిపట్ స్టేషన్లను అనుసంధానించడంతో పాటు మధ్యలో జింద్ సిటీ, పాండు పిండారా జంక్షన్,లలిత్ ఖేరా హాల్ట్, భంభేవా, ఇసాపూర్ ఖేరి హాల్ట్, బుటానా హాల్ట్, ఖండ్రాయి హాల్ట్, రబ్రా హాల్ట్, లాత్ హాల్ట్, మొహానా, బర్వాస్నీ హాల్ట్, సోనిపట్ న్యూ స్టేషన్లలో ఆగనుంది.

ADVERTISEMENT

వివరాలు 

హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న దేశాలు ఇవే..

భారత్ ఈ ప్రాజెక్టుతో హైడ్రోజన్ రైల్వే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్న దేశాల జాబితాలో చేరింది.

ఇప్పటికే జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి.

ప్రపంచంలో తొలి హైడ్రోజన్ ప్రయాణికుల రైలును జర్మనీ ప్రవేశపెట్టింది. అల్స్టోమ్ కొరాడియా ఐలింట్ (Alstom Coradia iLint) పేరుతో 2022లో సేవల్లోకి వచ్చిన ఈ రైలు ఒకసారి ఇంధనం నింపితే 1,175 కిలోమీటర్లు ప్రయాణించి రికార్డు సృష్టించింది.

డీజిల్ రైళ్లకు ప్రత్యామ్నాయంగా సున్నా ఉద్గారాల సాంకేతికతతో దీనిని అభివృద్ధి చేశారు. ఇదే ఏడాది జర్మనీ మరో మూడు హైడ్రోజన్ రైళ్లను కూడా సేవల్లోకి తీసుకురానుంది.

వివరాలు 

హైడ్రోజన్ రైళ్లు నడుపుతున్న దేశాలు ఇవే..

జపాన్‌లో 2027 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తొలి హైడ్రోజన్ హైబ్రిడ్ రైలు ఎంపిక చేసిన రైల్వే మార్గాల్లో సేవలు ప్రారంభించనుంది.

"హైబారి" పేరుతో ఈ రైలు టోక్యో సమీపంలోని కనగావా ప్రిఫెక్చర్‌లోని సురుమి, నంబు లైన్లలో నడవనుంది.

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం 2024లో 'జేము (Zemu)' పేరుతో తొలి హైడ్రోజన్ ప్రయాణికుల రైలును ప్రవేశపెట్టింది.

హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్, బ్యాటరీ హైబ్రిడ్ వ్యవస్థతో పనిచేసే ఈ రైలు కాలుష్యాన్ని తగ్గించేందుకు రూపొందించారు.

ఈ రైలు నుంచి నీటి ఆవిరి మాత్రమే వెలువడుతుండటంతో దీనిని పూర్తిగా పర్యావరణహిత రవాణా వ్యవస్థగా భావిస్తున్నారు.

ADVERTISEMENT