
దేశంలో జంట తుపాన్లు.. అరేబియాలో ఒకటి.. బంగాళాఖాతంలో మరొకటి..
ఈ వార్తాకథనం ఏంటి
కొద్ది రోజుల్లో దేశం అరుదైన జంట తుఫానులను చూసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.
2018లో చివరిసారిగా దేశంలో జంట తుపానులు సంభవించనట్లు ఇండియా టుడే పేర్కొంది.
అరేబియా సముద్రంలో ఆదివారం మధ్యాహ్నం తేజ్ సైక్లోన్.. తీవ్ర తుపానుగా అభివృద్ధి చెందగా.. మరొకటి 'హమూన్' తుపాను కూడా బంగాళాఖాతంలో ప్రారంభ దశలో ఉందని ఐఎండీ పేర్కొంది.
తేజ్ తుపాను అక్టోబర్ 25 తెల్లవారుజామున నాటికి అల్ గైదా (యెమెన్), సలాలా (ఒమన్) వైపు వెళ్తుందని ఐఎండీ అంచనా వేస్తోంది.
తుపాను
కేరళ, తమిళనాడులో వర్షాలు
ఆంధ్రప్రదేశ్‌లోని నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన జోన్ ను గుర్తించినట్లు ఐఎండీ పేర్కొంది.
సోమవారం నాటికి ఈ అల్పపీడనం బలపడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ప్రైవేట్ వాతావరణ అంచనా ఏజెన్సీ స్కైమెట్ ప్రకారం.. సైక్లోన్ హమూన్ మంగళవారం నాటికి తుఫానుగా పరిణామం చెందుతుందని అంచనా వేసింది.
ఈ రెండు తుపానుల ప్రభావం వాతావరణంపై తక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది.
స్కైమెట్ ప్రకారం.. తేజ్, హమూన్ తుపానుల వల్ల కేరళ, తమిళనాడులో ఆదివారం సాయంత్రం ఉరుములతో కూడిన వర్షాలు పడుతాయని ఐఎండీ అంచనా వేసింది.