LOADING...
civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు
భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

civil aviation: భారత్, పాక్ వార్ టెన్షన్.. పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 08, 2025
11:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశం, పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశంలోని ప్రతి విమానాశ్రయంలో భద్రతను మరింత కఠినంగా అమలు చేయాలని సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ బ్యూరో (BCAS)కు సూచనలు పంపింది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్‌పోర్టులలో ప్రయాణికులు సెకండరీ లాడర్ పాయింట్ చెక్ (SLPC)ను తప్పనిసరిగా ఎదుర్కొనవలసి ఉంటుంది. అదనంగా, టెర్మినల్ భవనాల్లో సందర్శన కోసం వచ్చే వ్యక్తులను అనుమతించబోమని స్పష్టంగా తెలిపింది. అంటే, సాధారణ విజిటర్లకు విమానాశ్రయాల్లోకి ప్రవేశానికి నిషేధం విధించబడింది.

వివరాలు 

మూడు గంటల ముందు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు..

ప్రయాణికుల చెక్‌-ఇన్, బోర్డింగ్ ప్రక్రియలు ఎలాంటి అంతరాయాలు లేకుండా సజావుగా కొనసాగేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ముందుగా షెడ్యూల్ చేసిన విమానాలు బయలుదేరే సమయానికి కనీసం మూడు గంటల ముందు ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు రావాలని సూచించింది. అంతేకాదు, వారి చెక్-ఇన్ ప్రక్రియ విమాన బయలుదేరే 75 నిమిషాల ముందుగానే పూర్తవుతుందని ఆదేశాల్లో పేర్కొంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పౌర విమానయాన శాఖ కీలక ఆదేశాలు