IMF: ప్రపంచ ఆర్థిక విస్తరణలో భారత్ కీలక పాత్ర: ఐఎంఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ ఆర్థిక వృద్ధికి భారత్ కీలకమైన చోదక శక్తిగా (గ్రోత్ ఇంజిన్) నిలుస్తోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి (IMF) స్పష్టం చేసింది. దేశంలో మూడో త్రైమాసిక ఆర్థిక వృద్ధి అంచనాలకన్నా బలంగా నమోదైందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నప్పటికీ, ప్రపంచ ఆర్థిక విస్తరణకు భారత్ ముఖ్యమైన పాత్ర పోషించనుందని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి భారత్ ఆర్థిక వృద్ధి రేటును 6.6 శాతంగా అంచనా వేసినట్లు ఐఎంఎఫ్ డైరెక్టర్ జూలీ కోజాక్ తెలిపారు.
Details
మరికొద్ది రోజుల్లో ప్రపంచ ఆర్థిక అంచనాలపై అప్డేట్లు రిలీజ్
ముఖ్యంగా దేశంలో మూడో త్రైమాసిక వృద్ధి రేటు తమ అంచనాలను మించి బలంగా ఉందని గమనించామని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు వృద్ధి అంచనాలను సవరించే అవకాశం ఉందని సంకేతమిచ్చారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ ఆర్థిక అంచనాలపై అప్డేట్లు విడుదల చేయనున్నామని, ఆ సమయంలో భారత్ వృద్ధి అంచనాల్లో మార్పులు చేయనున్నట్లు జూలీ కోజాక్ వెల్లడించారు.