Page Loader
Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి
బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి

Bangladesh: బంగ్లాదేశ్‌'లో హిందువులు, మైనారిటీల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశాం: విదేశాంగ కార్యదర్శి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 09, 2024
05:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత కార్యదర్శి విక్రమ్ మిశ్రి బంగ్లాదేశ్‌కు చేసిన పర్యటన ప్రముఖ ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వైపాక్షిక సంబంధాల్లో ఉద్రిక్తతలు తీవ్రత చెందడంతో, వీటిని పరిష్కరించడానికి మిశ్రి బంగ్లాదేశ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ విదేశాంగశాఖ కార్యదర్శి మహమ్మద్ జషీముద్దీన్, విదేశాంగశాఖ సలహాదారుతో తౌహిద్ హుస్సేన్‌తో జరిగిన చర్చల్లో, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై మిశ్రి ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల జరిగిన సంఘటనలపై, ముఖ్యంగా ఇస్కాన్ ప్రచారకర్త చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్ట్ గురించి వారు చర్చించారని మిశ్రి మీడియాతో పేర్కొన్నారు. అలాగే, బంగ్లాదేశ్ దళాలు భారత సరిహద్దుల్లో డ్రోన్లను మోహరించిన విషయాన్ని కూడా చర్చించినట్లు తెలిపారు.

వివరాలు 

చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్టుతో మరింత ఉద్రిక్తత

భారతదేశం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటోందని, బంగ్లాదేశ్‌లోని యూనస్‌ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఆసక్తి వ్యక్తం చేశారని మిశ్రి తెలిపారు. బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత, బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు మరింత పెరిగాయి. ముఖ్యంగా, ఇస్కాన్‌కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ అరెస్టుతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారితీసింది. ఆయనకు న్యాయసాయం అందించడంపై కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో, బంగ్లాదేశ్‌ ఇద్దరు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించుకున్నట్లు సమాచారం. వీరు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఢాకా నుండి పనిచేయాలని సూచించబడినట్లు తెలిసింది. దీని వల్ల ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగినట్లైంది.