
Covid cases: విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణ, దేశంలో కొత్తగా ఎన్ని కేసులు వచ్చాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24గంటల్లో భారత్‌లో కొత్తగా 656 మందికి కరోనా సోకింది.
దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కరోనాతో గత 24 గంటల్లో కేరళలో ఒకరు మరణించారు. దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,33,333 కు చేరుకుంది,
ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు కేరళలో 126 నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
కర్ణాటకలో 96, మహారాష్ట్రలో 35, దిల్లీలో 16, తెలంగాణలో 11, గుజరాత్ సహా 10 సహా రాష్ట్రాల్లో కరోనా కేసుల్లో పెరుగుదల నమోదైనట్లు కేంద్ర వెల్లడించింది.
దేశంలో ఇప్పటివరకు 220.67కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్‌లను అందించినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అత్యధికంగా కేరళలో కేసులు నమోదు
India logs 656 new #COVID19 cases, active case tally now 3,742#covidupdates https://t.co/njyf3S2m5t
— CNBC-TV18 (@CNBCTV18Live) December 24, 2023