
Covid-19 cases: కొత్తగా 841 మందికి కరోనా.. 7నెలల్లో ఇదే అత్యధికం
ఈ వార్తాకథనం ఏంటి
కరోనా కేసులు దేశంలో భారీగా పెరగడం ఆందోళన కగిలిస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 841కొత్త కోవిడ్ -19కేసులు నమోదయ్యాయి.
గత 227రోజులు లేదా ఏడు నెలల్లో ఇన్ని కేసులు ఒక్క రోజే నమోదు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,309కి పెరిగింది. వైరస్ కారణంగా కొత్తగా మూడు మరణాలు నమోదయ్యాయి.
కేరళ, కర్ణాటక, బిహార్‌లో ఒకరు చొప్పున మరణించారు. దేశంలో 2020లో కోవిడ్ వ్యాప్తి చెందినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 4.50 కోట్ల (4,50,13,272) కేసులు, నమోదయ్యాయి.
ఇటీవలి కేసుల పెరుగుదల ఉన్నప్పటికీ.. యొక్క రికవరీ రేటు 98.81 శాతంగా ఉంది. ఇప్పటి వరకు 220.67కోట్ల మందికి కోవిడ్ -19వ్యాక్సిన్‌లను అందిచారు.
కరోనా
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు.
వైరస్ వ్యాపించడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.
వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి కోవిడ్ -19 నిబంధనలను పాటించాలని ప్రజలను కోరారు.
అనారోగ్య సమస్యలు ఉన్న వారు, వృద్ధులు రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలని, ఫేస్ మాస్క్‌లు ధరించాలని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. JN.1 సబ్-వేరియంట్‌కు సంబంధించి 178 కేసులు నమోదయ్యాయి. ఈ వేరియంట్ ఇప్పటి వరకు తొమ్మిది రాష్ట్రాల్లో వెలుగుచూసింది.
గోవాలో అత్యధికంగా 47 కేసులు, కేరళలో 41 కేసులు నమోదయ్యాయి.