
India Pakistan War: 100కిపైగా పాక్ డ్రోన్లను కూల్చిన భారత్.. సరిహద్దుల్లో హై అలర్ట్!
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్ దాని ఆక్రమణదారుల ధోరణిని మార్చకుండానే దాడులకు తెగబడుతోంది.
భారత్ చెరిలో ఇప్పటికే గట్టి దెబ్బలు తిన్నా, యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు వరుసగా రెండో రోజూ డ్రోన్ దాడులకు యత్నించింది.
జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లో భారత భూభాగంపై దాడి చేయాలని పాకిస్థాన్ ప్రయత్నించింది.
అయితే భారత క్షిపణి రక్షణ వ్యవస్థ ఈ దాడులను సమర్థంగా తిప్పికొట్టింది. సాంబా సెక్టార్, జమ్మూ, పఠాన్ కోట్, పోఖ్రాన్ ప్రాంతాల్లో మరోసారి పాక్ డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి.
జమ్మూ, సాంబా సెక్టార్, పఠాన్ కోట్‌లో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ వాటిని తూట్లతో కూల్చివేసింది. ఈ పరిణామాల మధ్య కేంద్రం సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది.
Details
11 ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డ పాక్
మొత్తం 11 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్ దాడులకు తెగబడింది.
ఫిరోజ్‌పుర్‌లోని నివాస ప్రాంతాలపై డ్రోన్లు దాడి చేయడం వల్ల పౌరులకు గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకు 100కి పైగా పాక్ డ్రోన్లను భారత భద్రతా బలగాలు విజయవంతంగా కూల్చివేశాయి.
ఇదిలా ఉంటే, ఎల్ఓసీ వెంబడి పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతున్నారు. దీనికి భారత సైన్యం ధీటుగా ప్రతిస్పందిస్తోంది.
యూరీ, కుప్వారా, పూంచ్, నౌగామ్ సెక్టార్లలో కాల్పులు కొనసాగుతున్నాయి. జైసల్మేర్, అమృత్ సర్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో పూర్తిగా బ్లాక్ అవుట్ పరిస్థితులు ఏర్పడ్డాయి.
జమ్ముకశ్మీర్‌లో తాను ఉన్న ప్రాంతంలో కూడా కాల్పుల శబ్దాలు వినిపించాయని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.