Russia: వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన యూపీ ఇంజినీర్ అరెస్ట్.. సైన్యంలో చేరాలని ఒత్తిడి?.. మోదీకి ఇంజినీర్ భార్య విజ్ఞప్తి
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు. ఉద్యోగం కోసం వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన తన భర్తను అక్కడి సైన్యంలో చేరాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన భర్తతో పాటు తన కుటుంబాన్ని కూడా సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఆమె కోరారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
వివరాలు
వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన చందన్
సోషల్ మీడియాలో స్నేహ గుప్తా పోస్ట్ చేసిన వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా కొన్నేళ్ల క్రితం ఓ కంపెనీ తరఫున ఉద్యోగం నిమిత్తం రష్యాకు వెళ్లారు.
ఇందుకోసం వర్క్ వీసా పొందారు. అప్పటి నుంచి ఆయన రష్యాలోనే ఉంటున్నారు.భార్య స్నేహ, పదేళ్ల కుమారుడితో కలిసి అక్కడ నివసిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపణ
ఇటీవల తన భర్త చందన్ గుప్తాను మాస్కో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని స్నేహ వెల్లడించారు.
అయితే తనకు రష్యన్ భాష తెలియకపోవడంతో చందన్‌ను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారో తెలుసుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక కుటుంబం ఆందోళనకు గురవుతోందని తెలిపారు.
వివరాలు
రష్యా సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపణ
రష్యా సైన్యంలో సిబ్బంది కొరత ఉందని.. ఈ నేపథ్యంలో విదేశీయులను తమ సాయుధ దళాల్లో చేర్చుకునేందుకు అక్కడి అధికారులు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారని స్నేహ ఆరోపించారు.
ఈ క్రమంలోనే తన భర్తను అదుపులోకి తీసుకుని సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
వివరాలు
మోదీ, యోగికి స్నేహ విజ్ఞప్తి
తన భర్తతో పాటు తన కుటుంబం సురక్షితంగా భారత్‌కు తిరిగి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని స్నేహ కోరారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో జోక్యం చేసుకుని తమను స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించిన మాస్కోలోని భారత రాయబార కార్యాలయం
స్నేహ గుప్తా విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం స్పందించింది.
ఈ అంశాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. అలాగే చందన్ గుప్తా భార్య స్నేహ గుప్తాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఇంజినీర్ భార్య
Indian citizen Chander Gupta, an engineer working for Indian company Uflex in Moscow on a valid work visa, was arrested late at night around 12:30 AM. His wife Sneha Gupta has appealed to the authorities via social media for immediate help.@MEAIndia @mfa_russia @IndEmbMoscow… pic.twitter.com/cUUALoJ0em
— OSINT Spectator (@osintspectator) September 7, 2026