
Apple : ఆపిల్ కంపెనీకి కేంద్రం నోటీసులు.. ఫోన్ హ్యాకింగ్ పై వివరణ ఇవ్వాలన్న ఐటీ శాఖ
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా దిగ్గజ సెల్ ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ కు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు లోక్ సభ సభ్యులు కేంద్రంపై చేసిన హ్యాకింగ్ ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇండియా కూటమిలోని ప్రతిపక్ష నేతల ఫోన్లలో మాల్ వేర్ చొప్పించేందుకు ప్రయత్నం జరిగిందని ఎలా నిర్ధారించారని ప్రశ్నల వర్షం కురిపించింది.
దీనిపై ఎటువంటి ఆధారాలున్నాయో చూపించాలని, వాటిని తమకు అప్పగించాలని కేంద్ర ఐటీ శాఖ నోటీసుల్లో స్పష్టనిచ్చింది.
తమ ఫోన్లను భారత ప్రభుత్వం హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని ప్రతిపక్ష నేతలు శశిథరూర్, మహువా మోయిత్రా సహా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
details
ఏకంగా స్పీకర్ కు లేఖ రాసిన మహువా మోయిత్రా
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా అయితే ఏకంగా స్పీకర్ కు లేఖ కూడా సంధించారు. ఈ మేరకు ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన అలెర్ట్ మెసేజీలను మోయిత్రా బహిర్గతం చేశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సైతం ఈ అలెర్ట్ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్ గాంధీ కేంద్రంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్ష నేతల ఆరోపణలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని కుమార్ వైష్ణవ్ బదులిచ్చారు.
ఆపిల్ కంపెనీ దాదాపుగా 150 దేశాల్లోని తన వినియోగదారులకు అలెర్ట్ మెసేజీలు పంపించిందన్నారు.
ఒక్కోసారి పొరపాటున ఇటువంటివి జరుగుతాయని, దీనిపై యాపిల్ ను వివరణ కోరతామన్నారు.