
Murder in US: పెన్సిల్వేనియాలో భారతీయ వ్యాపారి దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక భారతీయ సంతతి వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటనలో ఆయనను మోటెల్ బయట జరగుతున్న గొడవను ఆపడానికి వెళ్లిన సమయంలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన కొద్దిరోజుల తర్వాత వెలుగు చూసింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. రాకేశ్ ఇహగబన్ అనే 51 ఏళ్ల భారతీయ వంశస్థుడు పిట్స్‌బర్గ్‌లోని రాబిన్సన్ టౌన్‌షిప్‌లో ఒక మోటెల్‌ని నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం,మోటెల్ ఎదుటున్న పార్కింగ్ ప్రాంతంలో గొడవ జరగడంతో దాన్ని ఆపేందుకు ఆయన బయటకు వెళ్లారు. ఎందుకు గొడవ పడుతున్నారని రాకేశ్ అడగడంతో నిందితుడు తన వద్ద ఉన్న తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రాకేశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
వివరాలు
స్టాన్లీ కోసం పోలీసులు గాలింపుచర్యలు
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని 37ఏళ్ల స్టాన్లీ యుజెన్ వెస్ట్‌గా గుర్తించారు. నిందితుడు అప్పటికే పార్కింగ్ వద్ద మరో యువతిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అదనంగా,స్టాన్లీ గత రెండు వారాలుగా రాకేశ్ మోటెల్‌లో అద్దెకు నివసించేవాడు అని వెల్లడించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.స్టాన్లీ కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు. ఇలాంటి ఘటన అమెరికాలో పాత పరిచయం అని చెప్పాలి.గడచిన నెలలోనే డాలస్‌లో కూడా ఒక దారుణం చోటుచేసుకుంది. అక్కడ స్థానికంగా ఒక మోటెల్ మేనేజర్‌గా పని చేసిన భారతీయ వంశస్థ చంద్రమౌళి నాగమల్లయ్యను సహోద్యోగి కత్తితో నరికి హత్యచేశారు. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు.హత్యకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు