Loading...
Shashi Tharoor: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య
ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య

Shashi Tharoor: ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై శశి థరూర్ విమర్శలు.. భారతీయులకే నష్టమని వ్యాఖ్య

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2026
11:59 am

ఈ వార్తాకథనం ఏంటి

విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లు-2026పై కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులను కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు. విదేశీ నిధులపై నియంత్రణ పేరుతో తీసుకొస్తున్న ఈ సవరణలు పారదర్శకతను పెంచవని, బదులుగా దేశంలోని విద్యాసంస్థలు, ఆసుపత్రులు, సేవా సంస్థలను నిర్వహిస్తున్న సామాజిక వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు చెందిన సంస్థలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ సవరణలతో కేంద్ర ప్రభుత్వం అధిక అధికారాలను తన చేతుల్లోకి తీసుకుంటోందని థరూర్ ఆరోపించారు.

వివరాలు 

స్వచ్ఛంద సంస్థలను దెబ్బతీయడం వల్ల ప్రజలే నష్టపోతారన్న థరూర్

ఏదైనా సంస్థకు చెందిన ఎఫ్‌సీఆర్‌ఏ లైసెన్స్ పునరుద్ధరణ కాకపోయినా లేదా రద్దయినా, విదేశీ నిధులతో ఎన్నో ఏళ్లుగా నిర్మించిన పాఠశాలలు, ఆసుపత్రులు, ఇతర ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే లేదా విక్రయించే అధికారం పొందడం అత్యంత ఆందోళనకర పరిణామమని అన్నారు.

నియంత్రణ పేరుతో పౌర సమాజాన్ని, స్వచ్ఛంద సంస్థలను క్రమంగా బలహీనపరిస్తే దాని ప్రభావం చివరికి సామాన్య ప్రజలపైనే పడుతుందని థరూర్ హెచ్చరించారు.

అందువల్ల ఈ ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లును వెంటనే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు.

అలా చేయకుండా ముందుకు వెళ్తే ప్రజాస్వామ్యబద్ధమైన తీవ్ర వ్యతిరేకతను ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

ADVERTISEMENT